జూనియర్ ఎన్టీఆర్ మరియు పూరి జగన్నాద్ దర్శకత్వంలో వచ్చిన ఆంధ్రావాలా సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది .అయితే తాజాగా ఈ సినిమా మరోసారి థియేటర్లలో కావడానికి సిద్ధంగా ఉంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. మార్చిలో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది అని తెలుస్తుంది. 2004లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విధంగా బోల్తా పడింది .జూనియర్ ఎన్టీఆర్ నటించిన సింహాద్రి సినిమా తర్వాత నటించిన సినిమా ఇది .ఇకపోతే ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి లాంటి బ్లాక్ బస్టర్ విజయాలతో జోరు మీద ఉన్న పూరి జగన్నాథ్ జూనియర్ ఎన్టీఆర్ తో ఆంధ్రావాలా సినిమా చేశారు. 

వరుసగా హిట్ సినిమాల జోష్ లో ఉన్న పూరి జగన్నాథ్ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా ప్రకటించడంతో అప్పట్లో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా రావడంతో రిలీజ్ కంటే ముందు ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఈ సినిమా రొటీన్ కాన్సెప్ట్ తో రావడంతో ప్రేక్షకులను ఊహించినంత స్థాయిలో మెప్పించలేకపోయింది .ఇక ఈ సినిమాలో శంకర్ పహిల్వాన్ గా మున్నా గా డ్యూయల్ రోల్ లో  జూనియర్ ఎన్టీఆర్ కనిపించాడు. అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో కనిపించిన మొదటి సినిమా ఇదే .మొదటిసారి జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో  కనిపించడంతో అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తెగ సంతోషించారు.

కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా దారుణ పరాజయాన్ని అందుకుంది. అప్పట్లో దారుణంగా డిజాస్టర్ గా మిగిలిన ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ కావడంతో టాలీవుడ్ లో ఈ వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.అంతేకాకుండా మార్చి నెలాఖరున ఈ సినిమా రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ కా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం త్రిబుల్ ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న అనంతరం కొరటాల శివతో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు ప్రశాంత్ నీ దర్శకత్వంలో కూడా మరొక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: