పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు స్టార్ట్ చేస్తూ వెళ్తున్నాడు కానీ అవి ఎప్పుడు పూర్తి చేయాలన్నది పర్ఫెక్ట్ ప్లానింగ్ మాత్రం మిస్ అవుతుందని చెప్పొచ్చు. క్రిష్ డైరెక్షన్ లో హరి హర వీరమల్లు సినిమా ఎప్పుడో మొదలైంది కానీ ఇప్పటివరకు ఆ సినిమాకు మోక్షం కలగలేదు. ఇక మరోపక్క వినోదయ సీత రీమేక్ ఈమధ్యనే సెట్స్ మీదకు వెళ్లింది. ఆ సినిమాను మాత్రం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడట పవన్.

అందుకే 22 రోజులకు గాను రోజుకి 2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుని ఒక్క సినిమాకు అది నెల రోజులు కూడా షూటింగ్ కు వెళ్లకుండా 44 కోట్ల దాకా జేబులో వేసుకుంటున్నాడు పవన్. అయితే సినిమా షూటింగ్ వరకేనా లేదా పవన్ డబ్బింగ్ చెప్పినా సరే ఈ కాల్ సీట్ లెక్క ప్రకారమే రెమ్యునరేషన్ ఇస్తారా అన్నది తెలియాల్సి ఉంది. వినోదయ సీతం లో సాయి ధరం తేజ్ కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాలో మామా అళ్లుల్లు ఇద్దరు అదరగొడతారని తెలుస్తుంది.

అంతేకాదు ఈ సినిమా రిలీజ్ కూడా సమ్మర్ లోనే అంటున్నారు. 3 నెలల్లో పవన్ సినిమా మొదలు పెట్టడం షూటింగ్ అవడం రిలీజ్ చేయడం ఇది సాధ్యమయ్యే పనేనా అని అంటున్నారు ఆడియన్స్. పవన్ అనుకుంటే చేసేయగలడు. సో పవన్ ఫిక్స్ అయ్యాడు అంటే వినోదయ సీతం రీమేక్ సమ్మర్ కి వచ్చి తీరుతుంది. ఈ సినిమాతో పాటుగా సాయి ధరం తేజ్ విరూపాక్ష కూడా సమ్మర్ రేసులో ఉంటుంది. వినోదయ సీతం రీమేక్ కి సముద్రఖని డైరెక్షన్ చేస్తుండగా త్రివిక్రం వెనక అంతా నడిపిస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాతో పాటుగా హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్, సుజిత్ సినిమా ఈ రెండిటినీ కూడా ఈ రెండు నెలల్లో షూటింగ్ చేయాలని డేట్స్ ఇచ్చేశాడు పవన్.


మరింత సమాచారం తెలుసుకోండి: