తెలుగు సినీ ఇండస్ట్రీలో యాక్టర్ హేమ గురించి ప్రత్యేకంగా చూపాల్సిన పనిలేదు.. గతంలో పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్గా నటించి బాగానే పేరు సంపాదించింది హేమ. ముఖ్యంగా బ్రహ్మానందం, హేమ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాలకు మంచి సక్సెస్ను అందిస్తూ ఉంటాయి. అలాగే తరచూ ఏదో ఒక వివాదంలో కూడా ఈమె నిలుస్తూనే ఉంటుంది. ఇక మా ఎలక్షన్లో సమయంలో కూడా ఈమె చేసిన రచ్చ అంతా కాదు. ఇప్పుడు మళ్లీ తాజాగా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కినట్లుగా తెలుస్తోంది. వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.


నటి హేమ తన భర్తతో కలసి బర్తడే పార్టీని మూడు సంవత్సరాల క్రితం జరుపుకున్నటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. అయితే ఈ వీడియో పైన హేమ ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే ఈ వీడియోలో తన భర్తతో లిప్ కిస్ చేస్తూ ఉన్నటువంటి వీడియో పైన పలు రకాల థంబ్నెయిల్ ఉపయోగించి అసత్య ప్రచారం చేస్తున్నారని తెలియజేయడం జరిగింది హేమ. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులకూ ఫిర్యాదు కూడా చేయడం జరిగింది.

అంతేకాకుండా కొంతమంది యూట్యూబర్స్ వెబ్సైట్లో పలు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ అసత్య ప్రచారం చేస్తున్నా వారి పైన చర్యలు తీసుకోవాలని ఆమె కోరడం జరిగింది.కొంతమంది సెలబ్రిటీలు బ్రతికి ఉన్నప్పుడే తప్పుడు వార్తలు రాసి డబ్బులు సంపాదిస్తున్నారని.. తాజాగా సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు బతికే ఉన్న చనిపోయినట్టు తప్పుడు ప్రచారం చేశారని తెలియజేస్తోంది హేమ .సెలెబ్రెటీలపై సామాజిక మాధ్యమాలలో ఇలాంటి వేధింపులు ప్రతిరోజు కూడా చాలానే వస్తున్నాయని ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని..ACP నీ కోరానని ఈ విషయంలో కోర్టు వరకు అయినా వెళ్తానని తాను ఈ విషయంపై వెనుకాడనని తెలియజేసింది హేమ. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చేసిన వీడియోలు తన దృష్టికి రావడంతో కోపంగా రగిలిపోయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: