ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో థియేటర్ లలో విడుదలకు రెడీగా ఉన్న సినిమాలు ఏవో ... అది ఏ తేదీన విడుదల కాబోతున్నాయో తెలుసుకుందాం.

మాస్ మహారాజా రవితేజ హీరో గా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన రావణాసుర మూవీ ని ఏప్రిల్ 7 వ తేదీన థియేటర్ లలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మూవీ లో సుశాంత్ ఒక కీలకమైన పాత్రలో నటించగా ... అను ఇమ్మానుయేల్ , దక్ష నాగర్కర్ , ఫరియ అబ్దుల్లా , మేఘ ఆకాష్ , పూజిత పన్నొడ హీరోయిన్ లుగా కనిపించబోతున్నారు. కిరణ్ అబ్బవరం హీరోగా రమేష్ కాడూరి దర్శకత్వంలో రూపొందిన మీటర్ మూవీ ని ఏప్రిల్ 7 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. 1947 ఆగస్టు 16 మూవీ ని ఏప్రిల్ 7 వ తేదీన విడుదల చేయనున్నారు. సమంత ... దేవ్ మోహన్ ప్రధాన పాత్రలలో రూపొందిన శాకుంతలం మూవీ ని ఆగస్టు 14 వ తేదీన విడుదల చేనున్నారు.


మూవీ కి గుణశేఖర్ దర్శకత్వం వహించాడు. రాఘవ లారెన్స్ ప్రధాన హీరో గా రూపొందిన రుద్రుడు మూవీ ని ఏప్రిల్ 14 వ తేదీన విడుదల చేయనున్నారు. సాయి ధరమ్ తేజ్ హీరోగా సంయుక్తా మీనన్ హీరోయిన్ గా కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన విరూపాక్ష మూవీ ని ఏప్రిల్ 21 వ తేదీన విడుదల చేయనున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరో గా రూపొందిన నేను స్టూడెంట్ సార్ మూవీ ని ఏప్రిల్ 21 వ తేదీన విడుదల చేయనున్నారు. హలో మీరా మూవీ ని ఏప్రిల్ 21 వ తేదీన విడుదల చేయనున్నారు. పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 మూవీ ని ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయనున్నారు. అఖిల్ హీరోగా సాక్షి వైద్య హీరోయిన్ గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఏజెంట్ మూవీ ని ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: