మెగాస్టార్ చిరంజీవి గురించి ఆయన స్టార్ స్టామినా గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిరంజీవి ఇప్పటికే తన కెరియర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఇప్పటికి కూడా స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న సమయం లోనే చిరంజీవి రాజకీయాల వైపు దృష్టి పెట్టి కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు. తిరిగి మళ్లీ ఖైదీ నెంబర్ 150 మూవీ తో సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ తోనే అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టి తన స్టామినా ను మరో సారి నిరూపించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా చిరంజీవి "వాల్టేరు వీరయ్య" మూవీ తో బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి ... మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోళా శంకర్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. తమన్నామూవీ లో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... మహతి స్వర సాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. కీర్తి సురేష్ మూవీ లో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో కనిపించబోతుంది. ఈ మూవీ ని ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది.

ఇది ఇలా ఉంటే టాలీవుడ్ యువ హీరో సిద్దు  జొన్నలగడ్డ ప్రస్తుతం టిల్లు స్క్వేర్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు తెలుస్తుంది. మరి ఈ యువ హీరో చిరంజీవి ని ఢీ కొట్టడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: