దళపతి విజయ్ ప్రస్తుతం లియో అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి క్రేజీ దర్శకుడు లోకేష్ కనకరాజు దర్శకత్వం వహిస్తూ ఉండగా ... త్రిషమూవీ లో విజయ్ సరసన హీరోయిన్ గా కనిపించ బోతుంది. అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం అక్టోబర్ 19 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఇది వరకే విజయ్ .. లోకేష్ కాంబినేషన్ లో మాస్టర్ మూవీ రూపొంది అద్భుతమైన విజయం సాధించడంతో లియో మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా నుండి చిత్ర బృందం ఒక స్పెషల్ వీడియోని విడుదల చేయగా ... ఆ వీడియో అద్భుతంగా ఉండడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింతగా పెరిగి పోయాయి. ఇది ఇలా ఉంటే ఇది వరకు విజయ్ ... లోకేష్ కాంబినేషన్ లో రూపొందిన మాస్టర్ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. ఈ మూవీ మ్యూజిక్ ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది.

ప్రస్తుతం విజయ్ ... లోకేష్ కాంబినేషన్ లో రూపొందుతున్న లియో మూవీ కి కూడా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తూ ఉండడం తో ... ఈ మూవీ మ్యూజిక్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.  దానితో ఈ మూవీ యొక్క మ్యూజిక్ హక్కులను ఒక ప్రముఖ ఆడియో సంస్థ ఏకంగా 16 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో లోకేష్ అద్భుతమైన భారీ యాక్షన్ సీక్వెన్సెస్ లను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ లోని యాక్షన్స్ సన్నివేషాలు అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: