నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ లో బాలయ్య సరసన మోస్ట్ బ్యూటిఫుల్ నటి కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది .  వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందు తున్న మొట్ట మొదటి మూవీ ఇదే . ఈ సినిమాలో ప్రస్తుతం అనేక మూవీ లలో నటిస్తున్న శ్రీ లీల ఒక కీలకమైన పాత్ర లో కనిపించనుంది . 

ఇప్పటి వరకు ఈ సినిమాకు చిత్ర బృందం టైటిల్ ని ఫిక్స్ చేయక పోవడంతో ... ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 108 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యం  లో ఈ మూవీ చిత్రీకరణను ఈ మూవీ బృందం ఎన్ బి కే 108 అనే వర్కింగ్ టైటిల్ తో పూర్తి చేస్తూ వస్తుంది . ఇది ఇలా ఉంటే తాజాగా బాలకృష్ణ కు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ప్రస్తుతం బాలకృష్ణ ... అనిల్ రావిపూడి దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు . ఈ సినిమా షూటింగ్ సెట్స్ నుండి బాలకృష్ణ కు సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .

తాజాగా ఎన్ బి కే 108 సెట్స్ నుండి బయటకు వచ్చిన ఫోటో  లో బాలకృష్ణ అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఉన్నాడు . తెల్లని గుబురు గడ్డంతో నల్లని జుట్టు లో అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఉన్న బాలకృష్ణ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: