సమంతతో విడాకులపై చైతు తెలివైన ఆన్సర్?

టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ అక్కినేని నాగార్జున పెద్ద కొడుకు ప్రముఖ టాలీవుడ్ యంగ్ హీరో యువ సామ్రాట్ నాగచైతన్య తన కో స్టార్ సమంతని ప్రేమించి పెళ్లి చేసుకొని తరువాత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మధ్య కాలంలో నాగ చైతన్య చేస్తున్న కామెంట్లు అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు ఇటు సోషల్ మీడియాలో కూడా చాలా బాగా వైరల్ అవుతున్నాయి.నేడు కష్టడి సినిమా విడుదల అయ్యింది.అందుకే ఇప్పుడు కస్టడీ సినిమా ప్రమోషన్లను జోరుగా చేస్తున్నాడు. అందులో భాగంగా నాగచైత్య తన పర్సనల్ విషయాలను మాత్రం ఎప్పటికప్పుడు బయట పెడుతూనే వస్తున్నాడు.ఆయన గతంలో సమంతతో విడిపోయినప్పటి నుంచి ఇప్పటి దాకా వీరిద్దరి విడాకుల విషయంపై అప్పుడప్పుడు నోరు విప్పుతున్నాడు. కానీ ఏది కారణమో మాత్రం చైతన్య చెప్పట్లేదు. అందువల్ల జనాలు కూడా ఏదో ఒకటి స్ప్రెడ్ చేస్తూనే ఉన్నారు. 


తన మాజీ భార్య సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్-2 సిరీస్ వల్లే ఇద్దరూ విడిపోయారనే టాక్ కూడా అప్పట్లో బాగానే నడిచింది.అయితే నాగచైతన్య మాత్రం దానిపై ఇప్పుడు క్లారిటీ ఇచ్చాడు. సమంత ఏదైనా చేయాలనుకుంటే కచ్చితంగా చేసి తీరుతుందని చెప్పాడు.ఆమె నటించిన సినిమాలు కూడా చాలా బాగుంటాయి. ఆమె చేసిన ఫ్యామిలీ మ్యాన్-2 ఇంకా యశోద సినిమాలు చూశాను.అందులో ఆమె నటన చాలా బాగుంది అంటూ చెప్పుకొచ్చాడు నాగ చైతన్య.అంటే ఒక రకంగా తమ విడాకులకు ఫ్యామిలీ మ్యాన్-2 సినిమా కారణం కాదని చైతూ క్లారిటీ ఇచ్చేశాడని అంటున్నారు నెటిజన్లు. ఒకవేళ అదే కారణం కనుక అయితే ఆ సినిమా గురించి చైతూ పొగడడు కదా అని అంటున్నారు. మరి ఇది కారణం కాకపోతే వీరిద్దరి విడాకులకు ఇంకేదైనా కారణం అయి ఉండొచ్చా అనే అనుమానాలు కూడా పెరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: