రామాయణ కథను ఎవరు ఎన్నిసార్లు చెప్పినా ప్రేక్షకులను అలరిస్తుంది. వెండితెర మీద శ్రీరాముడి కథను చాలా సందర్భాల్లో దృశ్య రూపం చూపించారు. ఈసారి బాహుబలుడు ప్రభాస్ తో ఆ ప్రయత్నం చేశాడు డైరెక్టర్ ఓం రౌత్. ప్రభాస్ రాముడి పాత్రలో చేసిన ఆదిపురుష్ సినిమా జూన్ 16న గ్రాండ్ గా రిలీజ్ అవబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా ఊపందుకున్నాయి. సినిమా రన్ టైం కూడా లాక్ అయినట్టు తెలుస్తుంది. ఆదిపురుష్ సినిమా కాస్త ఎక్కువ రన్ టైం నే ఎంచుకుందని టాక్.

ఫైనల్ గా సినిమా 174 నిమిషాలు అంటే రెండు గంటల యాభై నాలుగు నిమిషాల దాకా రన్ టైం వచ్చింది. అంటే దగ్గర దగ్గరగా 3 గంటల దాకా సినిమా ఉంటుందన్నమాట. ఈ రన్ టైం తో ఓం రౌత్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు అన్నది చూడాలి. ఆదిపురుష్ సినిమా రన్ టైం ఆడియన్స్ కు కొద్దిగా షాక్ ఇస్తున్నా ఫ్యాన్స్ మాత్రం ట్రైలర్ చూశాక సినిమా తప్పకుండా వర్క్ అవుట్ అవుతుందని అంటున్నారు. ముఖ్యంగా విజువల్స్ పరంగా మేకర్స్ తీసుకున్న జాగ్రత్త సినిమాను నెక్స్ట్ లెవెల్ లో నిలబెట్టింది. అందుకే ఆదిపురుష్ పక్కా సూపర్ హిట్ అనేస్తున్నరు.

ఆదిపురుష్ సినిమా విషయంలో ప్రభాస్ కూడా చాలా నమ్మకంగా ఉన్నాడు. సినిమాను వరల్డ్ వైడ్ గా భారీ ప్రీమియర్స్ తో పాటుగా గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సినిమా తప్పకుండా నెక్స్ట్ రేంజ్ లో ఉండబోతుందని అంటున్నారు. ప్రభాస్ రాముడి పాత్రలో నటించగా సీతమ్మగా కృతి సనన్ నటించింది. రావణాసుర పాత్రలో సైఫ్ అలీ ఖాన్ చేశారు. సినిమాపై అనుకున్న దానికన్నా ఎక్కువ బడ్జెట్ కాగా సినిమా 1000 కోట్ల టార్గెట్ తో రిలీజ్ అవుతుంది. ప్రభాస్ సినిమాకు హిట్ టాక్ వస్తే 1000 కోట్లు పెద్ద కష్టమేమీ కాదని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: