
తాజాగా సన్నీలియోన్ కెన్నడి అనే చిత్రంలో నటించింది. ఈ సినిమాకు ప్రముఖ బాలీవుడ్ ఫిలిం మేకర్ అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించారు.. అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా మీద నమ్మకం ఉన్నట్లుగా చిత్ర బృందం తెలియజేస్తోంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న సన్నీలియోన్ పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపింది.. బాలీవుడ్లో తను ఎంట్రీ ఇవ్వడానికి ముఖ్య కారణం బిగ్ బాస్ ఎ అంటూ సన్నీలియోన్ తెలియజేస్తోంది. బిగ్ బాస్ నిర్వాహకులు తనకి ఫోన్ చేసినప్పుడు తన భర్త కూడా ఓకే చెప్పారని.. కానీ తనకు మాత్రం ధైర్యం చాల్లేదని తెలిపింది.
అంతేకాకుండా ఇది ఇండియా నన్ను అభిమానించే వారి కంటే ద్వేషించే వారు ఎక్కువగా ఉంటారు.నేను ఇండియాకు వెళ్లానని చెప్పిందట. అయితే కొంతమంది స్నేహితుల సహకారంతో తనను ఒప్పించి బిగ్ బాస్ లోకి పాల్గొనేలా చేశారని తెలిపింది సన్నిలియోన్ ఆ సమయంలో చాలామంది తనను బెదిరించారని ఇండియాలో అడుగుపెడితే హత్య చేస్తామంటూ భయపెట్టారట.. బిగ్ బాస్ షోలో పాల్గొన్న సందర్భంగా కూడా చంపేస్తామని బెదిరించారని తెలిపింది కానీ ఎలాగోలాగా బిగ్ బాస్ షోలో పాల్గొన్నానని తెలిపింది.
బిగ్ బాస్ షో వల్ల తన జీవితమే మారిపోయిందని ఇక్కడి వారితో కలవడంతో పాటు ఎక్కువ సమయం గడపడం వల్ల ఇండియాలోనే ఉండాలనిపించింది.. అందుకే బిగ్ బాస్ తర్వాత నేను తన పాత జీవితాన్ని వదిలేసి బాలీవుడ్ నటిగా జీవితాన్ని మొదలు పెట్టానని తెలిపింది.