పుష్ప సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నాడు సుకుమార్. ఇండస్ట్రీలో సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 20 ఏళ్ల క్రితం వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఆర్య సినిమాతో మొదలైన ఈ క్రేజీ కాంబినేషన్ ఇప్పటివరకు హిట్ అవుతూనే వస్తుంది. పుష్ప సినిమా సుకుమార్ పాన్ ఇండియా డైరెక్టర్గా అల్లు అర్జున్ ఫ్యాన్ ఇండియా స్టార్ గా మారారు. ప్రస్తుతం పుష్ప టు సినిమా రెడీ అవుతుంది. ఈ క్రమంలోనే పుష్పట్టు సినిమా తర్వాత సుకుమార్ ఏ హీరోతో సినిమా చేస్తాడు అన్న చర్చ జరుగుతుంది. మరోపక్క సుకుమార్ ప్రభాస్ తో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడట.

 ఇక ఈ సినిమాను దిల్ రాజు నిర్మించే అవకాశాలు కూడా ఉన్నాయని సమాచారం. ఇప్పటికే ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. కాబట్టి సుకుమార్ పుష్ప సినిమా తర్వాత ప్రభాస్ తో సినిమా చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రభాస్ మాత్రమే కాకుండా సుకుమార్ హీరోల లిస్టులో మహేష్ బాబు సైతం ఉన్నాడట. అసలైతే పుష్ప సినిమా కంటే ముందే మహేష్ బాబుతో ఒక సినిమా చేయాలని అనుకున్నాడట సుకుమార్. కానీ వీరిద్దరి మధ్య కథ వర్క్ ఔట్ కాకపోవడంతో ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ప్రస్తుతం. త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా చేస్తున్నాడు మహేష్ బాబు.ఇక త్రివిక్రమ్ తో సినిమా పూర్తి కాగానే రాజమౌళితో ఒక సినిమా చేయబోతున్నాడు మహేష్ బాబు.

 ఇక రాజమౌళితో సినిమా తర్వాత ఖచ్చితంగా సుకుమార్ తో ఒక సినిమా చేస్తాడట మహేష్ బాబు .అయితే గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ఆల్రెడీ నేనొక్కడినే సినిమా వచ్చింది. ఇక ఆ సినిమా పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఈసారైనా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమా హిట్ అవుతుందా లేదా అన్నది చూడాలి. ఈ క్రమంలోనే సుకుమార్ మహేష్ బాబుకి ఒక సాలిడ్ హిట్టుని ఇవ్వాలని గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది .మహేష్ బాబు తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో కూడా ఒక సినిమా చేసే ప్లాన్ లో ఉన్నాడట సుకుమార్. పుష్ప సినిమా తర్వాత మహేష్ బాబు ప్రభాస్ విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోలతో సినిమా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక వీళ్ళు కాంబినేషన్ లో వచ్చే సినిమాలు ఎలాంటి విజయాలను అందుకుంటాయో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: