పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస  సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. హిట్టు ప్లాప్ లతో సంబంధం లేకుండా భారీ బడ్జెట్ సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు ప్రభాస్. ప్రస్తుతం ఆదిపురుష్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాతో పాటు సలార్ సినిమా కూడా ఇదే ఏడాది విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం.మారుతి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తూనే మరోవైపు ప్రాజెక్టు కె షూటింగ్లో సైతం పాల్గొంటున్నాడు ప్రభాస్. ఒకే సమయంలో రెండు సినిమా షూటింగ్లలో పాల్గొంటూ బిజీగా గడుపుతున్నాడు ప్రభాస్. 

ఇక ఒకేసారి రెండు మూడు సినిమా షూటింగ్లలో సమానమైన టైం నీ కేటాయించడం ఈ మధ్యకాలంలో ఒక ప్రభాస్ కి మాత్రమే సాధ్యమైంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు .అయితే అచ్చం ప్రభాస్ లాగానే జూనియర్ ఎన్టీఆర్ కూడా వచ్చే సంవత్సరం ఒకేసారి రెండు సినిమాలు ఒకే సమయంలో చేయబోతున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఇక జూనియర్ ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే .ప్రస్తుతం ఆ సినిమాకి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెల వరకు ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పూర్తయ్య అవకాశాల సైతం ఉన్నాయి. తెలుగులోనే కాకుండా హిందీలో కూడా సినిమాలు చేస్తున్నాడు ఎన్టీఆర్. ప్రస్తుతం హిందీలో వార్ 2 సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఎన్టీఆర్. అంతే కాదు వచ్చే ఏడాది కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సైతం ఒక సినిమా చేయబోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది వార్ 2  మరియు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోయే సినిమాల షూటింగ్ను ఒకేసారి చేయాలని ఫిక్స్ అయ్యారు జూనియర్ ఎన్టీఆర్. 2024 లో ఆ రెండు సినిమాలతో ఎన్టీఆర్ బిజీ గా మారబోతున్నాడు. నాలుగు నెలల గ్యాప్ లోనే 2025 లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: