
అందుకే అనసూయ సినిమాలతో పాటు మళ్లీ స్మాల్ స్క్రీన్ యాంకరింగ్ చేయాలని అనుకుంటుంది. అమ్మడు చేస్తానంటే ఛాన్స్ లు రావా చెప్పండి. ప్రస్తుతం స్మాల్ స్క్రీన్ లో ఒక షోని హోస్ట్ చేసేలా డిస్కషన్స్ నడుస్తున్నాయట. అనసూయ కూడా సినిమాల వల్ల వచ్చే మొత్తం సరిపోవట్లేదని బుల్లితెర మీద షోలకు రెడీ అవుతుందట. మరి అనసూయ నిజంగానే స్మాల్ స్క్రీన్ మీద షోలు చేస్తుందా లేదా ఇందతా ఒట్టి గాలి వార్తేనా అన్నది త్వరలో తెలుస్తుంది.
అనసూయ ప్రస్తుతం విమానం సినిమాలో సుమతి పాత్రలో నటించింది. ఈ సినిమాలో ఆమె మరోసారి తన హాట్ లుక్స్ తో అలరించనుంది. సినిమా ట్రైలర్ లో అనసూయ తన డైలాగ్ తో అందరిని మెప్పించింది. సినిమాల్లో తన పాత్రలకు ప్రాధాన్యత ఉండేలా చేస్తున్న అనసూయ సినిమా హిట్ అయితే తన పాత్ర గురించి కూడా అందరు మాట్లాడుకునేలా చేయాలని అనుకుంటుంది.
అయితే ఎంత సినిమాలు చేస్తున్నా ఇన్నాళ్లు తనని ఆదరించిన బుల్లితెర ఆడియన్స్ ను బాగా మిస్ అవుతున్న ఫీలింగ్ లో ఉంది అనసూయ. అందుకే ఏదైనా షో ఛాన్స్ వస్తే చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యిందట. అంతేకాదు దానికి తగిన రెమ్యునరేషన్ కూడా వస్తుంది కాబట్టి సినిమాల గ్యాప్ తో ఇలా కూడా సంపాదించాలని ఫిక్స్ అయ్యింది అమ్మడు.