టాలీవుడ్లో ఎన్నో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రాలు విడుదల అయ్యాయని చెప్పవచ్చు. కొన్ని సినిమాలు డైరెక్టర్ల మీద సక్సెస్ అవుతూ ఉంటే మరికొన్ని చిత్రాలు హీరోలు మీద సక్సెస్ అవుతూ ఉంటాయి కానీ కొన్ని చిత్రాలు మాత్రం హీరోయిన్ల వల్ల సక్సెస్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.. అలా భారీ సక్సెస్ అయిన చిత్రాల గురించి ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.


డైరెక్టర్ శేఖర్ కమ్ముల వరుణ్ తేజ్, సాయి పల్లవి కాంబినేషన్లో వచ్చిన చిత్రం ఫిదా ఈ సినిమా విడుదలై అప్పట్లో ఒక ట్రెండ్ ని సెట్ చేసింది. ముఖ్యంగా ఈ చిత్రంలోని పాటలు సాయి పల్లవి డైలాగ్ నటన డాన్స్ అందరిని ఆకట్టుకునేలా చేశాయి. ముఖ్యంగా హీరోని మించి ఈమెకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.  మరొక సినిమా సమంత, నాగచైతన్య కలిసి నటించిన చిత్రం మజిలీ ఈ చిత్రంలో నాగచైతన్య కంటే సమంత పాత్రకి ఎక్కువగా ప్రాధాన్యత ఉండడంతోపాటు ఆమె వల్లే ఈ సినిమా సక్సెస్ అయ్యిందని కూడా చెప్పవచ్చు.


మరొక సినిమా డైరెక్టర్ త్రివిక్రమ్, నితిన్, సమంత, అనుపమ కాంబినేషన్లో వచ్చిన చిత్రం అ ఆ.. ఈ సినిమా కూడా అప్పట్లో విడుదలై సమంతకు నితిన్ కు మంచి క్రేజీ తెచ్చింది. కానీ ఈ క్రెడిట్ అంతా కూడా సమంతానే కొట్టేసింది. ఇప్పటికీ ఈ సినిమా బుల్లితెరపై ప్రసారమయ్యిందంటే చాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. ఇక మరొక చిత్రం డైరెక్టర్ శేఖర్ కమల సాయి పల్లవి, నాగచైతన్య కాంబినేషన్లో వచ్చిన చిత్రం లవ్ స్టోరీ ఈ సినిమా కూడా పాటలతో పాటు సాయి పల్లవి నటన డాన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచేలా చేశాయి. దీంతో ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా హీరోని హీరోయిన్ డామినేషన్ చేసే పాత్రలు ఈ చిత్రాలన్నీ కూడా సక్సెస్ అయ్యాయని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: