హీరో రామ్ పోతినేని డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటివరకు విడుదలైన అప్డేట్లు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న రామ్ ఆ తర్వాత సరైన సక్సెస్ ని మాత్రం అందుకోలేక పోతున్నారని చెప్పవచ్చు. అందుకే మాస్ డైరెక్టర్ తో మరొకసారి ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా దసరా సీజర్ల విడుదలకు సిద్ధంగా ఉన్నది ఈ సినిమా టైటిల్ ని ఇంకా ప్రకటించలేదు చిత్ర బృందం.


ప్రస్తుతానికి ఈ సినిమా వర్కింగ్ టైటిల్# BOYAPATIRAPO అంటు వర్కింగ్ టైటిల్ ని మాత్రమే ఉంచడం జరిగింది. బోయపాటి శ్రీను కూడా ఈసారి తనదైన స్టైల్ లో రామ్ ని మాస్ యాంగిల్ లో చూపించేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో రాకపోతేనేని పాత్ర హై ఎనర్జీతో డబుల్ ఇస్మార్ట్ గా చూపించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో హీరోయిన్గా శ్రీ లీల నటిస్తోంది. షూటింగ్ స్పాట్ నుంచి పలు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. రామ్, శ్రీ లీల ఒకరితో ఒకరు పోటీపడి మరి ఎనర్జీ టిప్ తో చాలా అందంగా కనిపిస్తున్నారని తెలుస్తోంది.


హీరో రామ్ చాలా కఠినమైన స్టైలిష్ గా కనిపిస్తూ ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే వీరిద్దరూ కలిసి ఈ సినిమాలో చాలా రోజులుగా నటిస్తున్న ఇంతవరకు ఏ ఒక్క ఫోటో కూడా బయటికి రాలేదు. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ ని మైసూరులో ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇద్దరు డ్యాన్సుల్లో కూడా చాలా ఎనర్జీటీతో పోటీగలరని చెప్పవచ్చు. దీంతో తెర పైన వీరిద్దరి డాన్స్ డబుల్ ధమాకారేట్ ఇస్తుందని కూడా అభిమానులు అంచనా వేస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: