పవన్ కళ్యాణ్ చాలామంది హీరోలు లా క్రికెట్ మ్యాచ్ లకు వచ్చి ఆ గేమ్ ను ఎంజాయ్ చేసిన సందర్భాలు ఎక్కడా కనిపించవు. అయితే పవన్ ఇప్పుడు ఒక యంగ్ క్రికెటర్ కు ఆర్ధిక సహాయం చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పవన్ చాలామందికి ఆర్ధిక సహాయాలు చేస్తూ ఉంటాడు.
అయితే ఆ సహాయాలలో కొన్ని విషయాలు బయటకు వస్తాయి మరికొన్ని బయటకు రావు. ప్రధానంగా ప్రతిభ ఉన్న వారికి పవన్ కళ్యాణ్ ఎప్పుడూ సహకారం అందిస్తాడు. లేటెస్ట్ గా పవన్ ఒక యంగ్ క్రికెటర్ కు చేసిన సహాయం బయటకు ఎవరికీ తెలియకపోయినా ఇప్పుడు జనసైనికుల ద్వారా ఈ వార్త సోషల్ మీడియాలో లీక్ అయింది.
ఈ సంవత్సరం జరిగిన అండర్ 19 క్రికెట్ కప్ లో వైస్ కెప్టెన్ బ్యాట్స్ మెన్ గా సత్తా చాటిన తెలుగు యువకుడు షేక్ రషీద్ కు పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం చేశాడు. గుంటూరుకు చెందిన ఈ క్రికెటర్ సమర్థత గురించి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అతడికి తన ‘పవన్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్’ ట్రస్ట్ నుంచి 2 లక్షల రూపాయాల ఆర్థికసహాయాన్ని అందించినట్లు తెలుస్తోంది.
ఈ సహాయాన్ని కొంతమంది జనసేన నాయకులు రషీద్ నివాసానికి వెళ్ళి ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు త్వరలోనే రషీద్ పవన్ ను కలిసే అవకాశం ఉంది అని అంటున్నారు. ఈ వార్తలు ఇలా ఉండగా ఈనెల 14వ తేదీన జరగబోయే జనసేన ఆవిర్భావ సమావేశంలో పవన్ ప్రస్తుత రాజకీయాల పై అదేవిధంగా సినిమా టిక్కెట్ల వ్యవహారం పై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసే ఆస్కారం ఉందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీతో పొత్తును కొనసాగిస్తున్న పవన్ ఈ విషయమై తన అభిమానులకు ఎలాంటి సందేశం ఇస్తాడు అన్న ఆశక్తి అందరిలోనూ ఉంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి