నందమూరి సింహం బాలకృష్ణ తాను మనసులో అనుకున్నది ఎటువంటి మొహమాటం లేకుండా బయటకు చెపుతాడని ఇండస్ట్రీలో చాలామంది చెపుతూ ఉంటారు. అలాంటి బాలకృష్ణ సినిమాల డేట్లు అతడికి సంబంధించిన ప్రోగ్రామ్ లు వ్యవహారాలూ అన్నీ బాలయ్య చిన్న కూతురు తేజస్విని చూస్తోంది అంటూ ఇండస్ట్రీ వర్గాలలో వార్తలు హడావిడి చేస్తున్నాయి.చిన్నప్పటి నుండి సినిమాల పట్ల మంచి అవగాహన ఉన్న తేజస్విని ప్రస్తుతం బాలకృష్ణ సినిమాలకు సంబంధించిన డేట్స్ వ్యవహారంతో పాటు అతడి కాస్ట్యూమ్స్ డిజైనింగ్ అదేవిధంగా బాలయ్య నటించబోయే సినిమాల స్టోరీ లైన్స్ వింటూ బాలయ్యకు చేదోడువాదోడుగా ఉంది అంటూ వార్తల హడావిడి జరుగుతోంది. తేజస్విని భర్త విశాఖపట్నంలో ప్రముఖ విద్యా సంస్థగా పేరుగాంచిన గీతమ్స్ అధినేత అయినప్పటికీ తేజస్విని ప్రస్తుతం తనకు సినిమాల పై ఉండే అభిరుచితో బాలయ్యకు సలహా సంప్రదింపులు అందిస్తోంది అని టాక్.


బాలయ్య తన పిల్లలు అందర్నీ చాల క్రమశిక్షణ లతో పెంచిన విషయం తెలిసిందే. పెద్ద కూతురు బ్రాహ్మణి హెరిటేజ్ వ్యవహారాలను చక్కపెడుతూ ఉంటే చిన్న కూతురు తేజస్విని బాలయ్య సినిమా వ్యవహారాలు చూస్తోంది అనుకోవాలి. అయితే అందరి దృష్టి మాత్రం మోక్షజ్ఞ పైనే ఉంది అతడు సినిమాలలోకి వస్తాడు అని బాలయ్య ప్రతి సంవత్సరం చెపుతున్నప్పటికీ ఎప్పుడు వస్తాడు అన్నవిషయం పై స్పష్టమైన క్లారిటీ లేదు.


దీనితో ఈవిషయమై బాలయ్య అభిమానులలో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ బాలయ్య పట్టించుకోవడం లేదు. వరసపెట్టి నందమూరి సింహం సినిమాలు చేస్తున్నప్పటికీ అభిమానులు మాత్రం మోక్షజ్ఞ పై చాల ఆశలు పెట్టుకున్నారు. దీనికితోడు మోక్షజ్ఞ ఏ సినిమా ఫంక్షన్ లోను బాలయ్య పక్కన కనిపించకపోవడం అభిమానులకు మరొక అసంతృప్తి ఈ అసంతృప్తిని తమ నందమూరి హీరో వచ్చే సంవత్సరం అయినా తీరుస్తాడని ఆశతో అభిమానులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న గోపీచంద్ మలినేని మూవీ డిసెంబర్ లో కాకుండా సంక్రాంతికి విడుదల చేస్తే మంచి బిజినెస్ అవుతుందని నిర్మాతలు భావిస్తున్నట్లు టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: