నాగార్జున చిరంజీవి లు చాల సన్నిహితులు అలాంటిది వీరిద్దరి సినిమాలు ఒకేరోజు పోటాపోటీగా విడుదల అవ్వడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ‘ఆచార్య’ ఫెయిల్యూర్ తరువాత చిరంజీవి తన స్టామినాను నిరూపించుకోవడానికి ఒక బ్లాక్ బష్టర్ హిట్ కావాలి. అది ‘గాడ్ ఫాదర్’ ఇస్తుందని చిరంజీవితో పాటు మెగా ఫ్యాన్స్ కూడ చాల ఆశ పడుతున్నారు.


నాగార్జున కెరియర్ కు సంబంధించి ‘సోగ్గాడే చిన్ని నాయన’ తరువాత సరైన హిట్ లేదు. యంగ్ హీరోలు కూడ 100 కోట్ల క్లబ్ లోకి వెళ్లిపోతుంటే నాగార్జున మాత్రం 50 కోట్ల మార్క్ ను దాటలేకపోతున్నాడు. ఇలాంటి పరిస్థితులలో ఒక బ్లాక్ బష్టర్ హిట్ కోరుకుంటున్న నాగ్ చిరంజీవి ల మధ్య పోటీ ఏమిటి అంటూ ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్య పోతున్నారు.


ఇది ఇలా ఉంటే ఈ సినిమాలకు సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుకలను హైదరాబాద్ లో కాకుండా చిరంజీవి నాగార్జున లు ఎవరికి వారు రాయలసీమ ప్రాంతంలో ఎందుకు చేస్తున్నారు అంటూ మరికొందరు ఆశ్చర్య పోతున్నారు. ‘ది ఘోస్ట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 25న కర్నూలులో భారీ స్థాయిలో నిర్వహించబోతున్నారు. అదేవిధంగా ఈ నెల 28న ‘గాడ్ ఫాదర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అనంతపురంలో భారీ స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.  


వాస్తవానికి రాయలసీమ ప్రాంతంలో చిరంజీవికి అభిమానులు ఎక్కువగా ఉన్నప్పటికీ కోస్తా జిల్లాలతో పోల్చుకుంటే రాయలసీమలో చిరంజీవి మ్యానియా తక్కువ. ఇక నాగార్జున విషయానికి వస్తే రాయలసీమలో నాగ్ కు పెద్దగా అభిమానులు లేరు. దీనితో ఈ సీనియర్ హీరోలు ఇద్దరూ తమకు అంతగా బలం లేని రాయలసీమ ప్రాంతంలో తమ సినిమాల ప్రమోషన్ ఫంక్షన్స్ ను ఎందుకు నిర్వహిస్తున్నారు అంటూ ఇండస్ట్రీ వర్గాలలో అనేక చర్చలు జరుగుతున్నాయి. ఇద్దరు సీనియర్ హీరోలు రానున్న దసరా కు పోటీ పడుతున్న పరిస్థితులలో ఈసారి దసరా విజేత ఎవరు అన్న విషయమై అనేక ఊహాగానాలు వస్తున్నాయి..
మరింత సమాచారం తెలుసుకోండి: