
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో దేశవ్యాప్తంగా ఎలాంటి సంచలనం క్రియేట్ చేశారో అందరం చూశాం. 2024 డిసెంబర్ 4న రిలీజ్ అయిన పుష్ప పార్ట్ 2 సినిమా బాక్సాఫీస్ దగ్గర ట్రెండ్ సెట్ చేసి నేషనల్ వైడ్ ఆల్ టైం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. ఈ సినిమా వచ్చి ఆరు నెలలు అవుతుంది ఇంకా బన్నీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను పట్టాలు ఎక్కించలేదు. బన్నీ తన నెక్స్ట్ ప్రాజెక్టును తమిళ దర్శకుడు అట్లీతో ఇప్పటికే అనౌన్స్ చేసినా ఈ సినిమా ఎప్పుడు పట్టాలు ఎక్కుతుందో తెలియదు. ప్రస్తుతం బన్నీ తో పాటు కామన్ ఆడియెన్స్ కు కూడా ఓ డౌట్ ఉంది. అసలు బన్నీ తర్వాత సినిమా ఎవరితో ఉంటుంది ? అది అట్లీనా ? లేక త్రివిక్రమ్ నా ? అసలు బన్నీ ఎందుకు ఈ తాత్సారం చేస్తున్నాడు . అన్న సందేహాలు ఇప్పుడు అందరిలోనూ గట్టిగా వినిపిస్తున్నాయి.
పుష్ప ఫ్రాంచైజీ కోసమే బన్నీ ఏకంగా 5 ఏళ్లు టైం తీసుకున్నాడు. ఇప్పుడు పుష్ప 2 వచ్చి కూడా ఆరు నెలలు అవుతోంది. ఇంకా తర్వాత సినిమా స్టార్ట్ కాలేదు. ఇకనైనా బన్నీ తన తర్వాత సినిమా ను అట్లీతో చేయాలనుకుంటే త్వరగా సెట్స్ మీదకు తీసుకువెళితే బాగుంటుందన్న అభిప్రాయాలే సర్వత్రా వినిపిస్తున్నాయి. మిగిలిన స్టార్ హీరోల మాదిరిగా ఆయన కూడా వరుస ప్రాజెక్టులు పట్టాలెక్కిస్తే బాగుంటుందని బన్నీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు