ప్రీతి జింటా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ భామ బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అనేక సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ తన అభిమానులను ఆకట్టుకుంది. తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలోనూ నటించి సక్సెస్ఫుల్ స్టార్ హీరోయిన్ గా తన కెరీర్ ను కొనసాగిస్తోంది. తెలుగులోనూ అనేక సినిమాలలో నటించింది. తెలుగులో స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ లాంటి పెద్ద హీరోల సినిమాలలో హీరోయిన్ గా చేసి తన ప్రత్యేకతను చాటుకుంది.


సొట్టబుగ్గల సోయగంతో ప్రతి ఒక్క అభిమాని చూపును తన వైపుకు తిప్పుతుంది. ఇక ప్రీతి జింటా ఓవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు పంజాబ్ కింగ్స్ ఓనర్ గా వ్యవహరిస్తున్నారు. పంజాబ్ కింగ్స్ జట్టుకు కెప్టెన్ గా తన వంతు న్యాయాన్ని చేస్తున్నారు. క్రికెటర్లకు స్టేడియంలో ఎప్పుడు తనవంతు ప్రోత్సాహాన్ని అందిస్తూనే ఉంటుంది. స్టేడియం కి వచ్చిన అభిమానులతో కూడా చాలా చలాకీగా మాట్లాడుతుంది.


ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ జట్టుకు కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ కొనసాగుతున్నారు. తన జట్టుకు కెప్టెన్ గా ఉన్న అయ్యర్ తో ప్రీతి చాలా క్లోజ్ గా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. వారిద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని చూసి చాలామంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ప్రీతి జింటాకు శ్రేయస్ అయ్యర్ కు మధ్య ఏదో ఎఫైర్ ఉందని అనేక రకాల వార్తలను వైరల్ చేస్తున్నారు. ఈ విషయం తెలిసి పలువురు క్రికెట్ అభిమానులు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

 కొంతమంది తన జట్టుకు కెప్టెన్ కావడంతో అలా క్లోజ్ గా ఉంది ప్రీతి జంట అలాంటిది కాదని వీరిద్దరి మధ్య ఎలాంటి ఎఫైర్ లేదని కేవలం స్నేహం మాత్రమే ఉందని కొంతమంది అంటున్నారు. మరి కొంతమంది సినీ పరిశ్రమలో ఇలాంటివి చాలా కామన్ అని అంటున్నారు. ఈ వార్తలపై ప్రీతి జింటా ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: