
ఎన్టీఆర్ తన అమ్మకు ఇచ్చిన మాటను ఇప్పటికీ తూచా తప్పకుండా పాటిస్తున్నారని అభిమానులు చెబుతున్నారు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల పట్ల ఎన్టీఆర్‌కి అపారమైన గౌరవం ఉందని, ఆయన అనేక సందర్భాల్లో స్టేజిపైనే చెప్పిన విషయం తెలిసిందే.జూనియర్ ఎన్టీఆర్‌కి ఒక వయసు వచ్చిన తర్వాత, ఆయన తల్లిగారు ఒక మాట తీసుకున్నారని వార్తలు వచ్చాయి. "నీ వల్ల ఎవరూ, ముఖ్యంగా అమ్మాయిలు ఇబ్బంది పడకూడదు. నీ కోపం, నీ మాటల వల్ల ఎవరి హృదయం బాధపడకూడదు. అమ్మాయిల పట్ల ఎప్పుడూ గౌరవంగా ప్రవర్తించాలి. అసభ్యంగా ప్రవర్తించడం, నీచమైన జోకులు వేయడం, అమ్మాయిలను కంటతడి పెట్టించడం లాంటి పనులు అస్సలు చేయకూడదు." అని ఎన్టీఆర్ దగ్గర ప్రామిస్ తీసుకున్నారట.
ఆ సమయంలో ఈ వార్త బాగా వైరల్ అయ్యింది. ఇప్పుడు వార్ 2 సినిమా తర్వాత మళ్లీ ఈ విషయమే హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతోంది. ఎందుకంటే ఇప్పటివరకు ఎన్టీఆర్ వల్ల ఏ హీరోయిన్ కానీ, ఏ అమ్మాయి కానీ ఇబ్బంది పడ్డ ఘటన ఒక్కటీ లేదని ఫ్యాన్స్ చెబుతున్నారు. అంతేకాకుండా, ఆయన ప్రవర్తన వల్ల చాలా మంది మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయని కూడా అభిమానులు హైలైట్ చేస్తున్నారు. ఇప్పుడు అందరి ఫోకస్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమా పైనే ఉన్నాయి.