టాలీవుడ్‌లో విన‌డానికే షాకింగ్ గా ఉన్న ఓ ప్రాజెక్ట్ సెట్ అయ్యింది. మైత్రీ మూవీస్ నిర్మాణంలో నితిన్ - శ్రీను వైట్ల కాంబినేష‌న్ లో సినిమా. అదేంటి శ్రీను వైట్ల వ‌రుస ప్లాపులు ఇస్తున్నాడు.. మ‌నోడిని ఏ హీరో కూడా ద‌గ్గ‌ర‌కు రానిచ్చే ప‌రిస్థితి లేదు.. ఇటు నితిన్ కూడా వ‌రుస పెట్టి ప్లాపుల మీద ప్లాపులు ఇస్తున్నాడు... ఇప్పుడు వీరిద్ద‌రిని పెట్టుకుని మైత్రీ మూవీస్ ఎందుకు ? ఇంత పెద్ద రిస్క్ చేస్తుంద‌న్న‌ది ఎవ్వ‌రికి అర్థం కావ‌డ‌ట్లేదు. శ్రీను వైట్ల గోపీచంద్ హీరోగా విశ్వం లాంటి ప్లాప్ సినిమా తీశాడు. ఇటు నితిన్‌కు వ‌రుస‌గా ప్లాపులే వ‌స్తున్నాయి. పైగా మైత్రీ వాళ్ల బ్యాన‌ర్లోనే రాబిన్‌హుడ్ సినిమా డిజాస్ట‌ర్ అయ్యింది.


మ‌రి ఇప్పుడు ఎందుకు ప్లాప్ ల హీరో .. ప్లాపుల డైరెక్ట‌ర్‌తో మైత్రీ రిస్క్ చేస్తుంద‌న్న‌ది ఎవ్వ‌రికి అర్థం కాని ప‌రిస్థితి. ఇదే మైత్రీ బ్యాన‌ర్లో శ్రీను వైట్ల అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ సినిమా తీస్తే పెద్ద ప్లాప్ అయ్యింది. నితిన్ వి ప్ర‌స్తుతం రెండు ప్రాజెక్టు లు హోల్డ్ లో ఉన్నాయి. త‌మ్ముడు ప్లాప్ త‌ర్వాత బ‌లంగం అట‌కెక్కింది. ఎల్ల‌మ్మ టైటిల్‌తో నితిన్ హీరోగా దిల్ రాజు చేయాల‌నుకున్న సినిమాను ప్ర‌స్తుతం చేస్తారా లేదా ? అన్న‌ది తెలియ‌ట్లేదు. ఇక యూవీ వాళ్ల‌తో విక్ర‌మ్ కుమార్ డైరెక్ష‌న్ లో ఓ సినిమా ఉంది. ఇది విశ్వంభ‌ర సినిమా రిలీజ్ అయ్యే వ‌ర‌కు తేలేలా లేదు.


ఈ క్ర‌మంలోనే శ్రీను వైట్ల చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో నితిన్ వెంట‌నే సై అన్న‌ట్టు తెలుస్తోంది. అందుకే మైత్రీ వాళ్ల‌కు కూడా క‌థ న‌చ్చ‌డంతో శ్రీను వైట్ల మీద న‌మ్మ‌కంతో ఓకే చేశార‌ని అంటున్నారు. అలా అనుకోకుండా ఈ షాకింగ్ కాంబినేష‌న్ సెట్ అయ్యింది. మిగిలిన వివ‌రాలు త్వ‌ర‌లో నే వెల్ల‌డి కానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: