స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డ నటించిన తాజా చిత్రం ‘తెలుసు కదా’ ఇటీవల థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందనను పొందింది. నీరజా కోన దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి ఆశలు పెట్టుకున్నారు. కానీ అంచనాలకు తగిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. సినిమా ప్రదర్శన పరంగా ఓ మోస్తరు ఫలితాన్ని నమోదు చేసుకుంది. అయితే సిద్ధు నటనకు మాత్రం ప్రేక్షకులు, విమర్శకులు కూడా ప్రశంసించారు. ఈ సినిమా తర్వాత సిద్ధు తన తదుపరి ప్రాజెక్టులపై కాన్‌సంట్రేషన్ చేస్తున్నాడు. గతంలో ప్రకటించిన ప్రెస్టీజియస్ సినిమా ‘కోహినూర్’ ఇప్పుడు డైలమా లోకి వెళ్లినట్లు సమాచారం. భారీ బడ్జెట్‌తో రూపొందించాలనుకున్న ఈ ప్రాజెక్ట్‌ను రెండు భాగాలుగా తెరకెక్కించే ఆలోచనలో టీమ్ ఉంది. కానీ ప్రస్తుతం సిద్ధు కెరీర్ గ్రాఫ్ కొద్దిగా నెమ్మదించినందున, ఇంత భారీ పెట్టుబడి పెట్టడం రిస్క్‌గా భావిస్తున్నారని సినీ వర్గాల టాక్.
ఈ సినిమాను దర్శకుడు రవికాంత్ పెరిగంట ( క్షణం ఫేమ్) తెరకెక్కించాల్సి ఉంది. నిర్మాతలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాణం చేపట్టేందుకు సిద్ధమయ్యారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లడం కష్టమని భావించి, తాత్కాలికంగా నిలిపివేశారని వార్తలు వస్తున్నాయి. ఇక సిద్ధు జొన్నలగడ్డ మాత్రం నిరుత్సాహపడకుండా తన తదుపరి ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ముఖ్యంగా సిద్ధు సూపర్ హిట్ సిరీస్‌లో భాగంగా తెరకెక్కనున్న ‘టిల్లు క్యూబ్’ ( డీజే టిల్లు సీక్వెల్ ) పై భారీ అంచనాలు ఉన్నాయి. అదనంగా ఆయన ‘ బ్యాడాస్ ’ అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కూడా నటించనున్నాడు. మొత్తం మీద, ‘కోహినూర్’ ప్రాజెక్ట్ అనిశ్చితిలో ఉన్నప్పటికీ, సిద్ధు జొన్నలగడ్డ తన ప్రత్యేక స్టైల్‌కి తగ్గ పాత్రలతో మళ్లీ బౌన్స్ బ్యాక్ కావాలని ప్లాన్ చేస్తున్నాడు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి