రవితేజ మాట్లాడుతూ –“మీ అందరికీ తెలుసు కదా.. శ్రీలీల ఇప్పటివరకు చాలా లవ్లీ క్యారెక్టర్స్ చేసింది. కానీ ఈ సినిమాలో మీరు ఆమెను ఎప్పుడూ చూడని కొత్త అవతారంలో చూడబోతున్నారు. ఊర మాస్ అమ్మాయిగా.. పక్కా నాటు స్లాంగ్‌తో.. రెచ్చిపోయే ఎనర్జీతో కనిపించబోతుంది. ఆమె పాత్ర ఒక్క మాటలో చెప్పాలంటే… ‘కొడతా… కొడతా… కొడకల్లారా!’ అన్న రేంజ్‌లో ఉంటుంది!”అని చెప్పగానే అక్కడ ఉన్న ప్రేక్షకులంతా చప్పట్లతో హాళ్లను నింపేశారు. అయితే ఈ డైలాగ్ లో ఉన్న భారీ బూతు పదం విన్న ప్రేక్షకుల్లో కొంతమంది షాక్ అయ్యారు. సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు అదే వీడియో వైరల్ అవుతూ “స్టేజ్ మీద రవితేజ రెచ్చిపోయాడు”, “మాస్ రాజా మాటలతో మాస్ ఫ్యాన్స్ ఫిదా” అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
‘మాస్ జాతర’లో శ్రీలీల పూర్తిగా కొత్త అవతారంలో కనిపించబోతోంది. ఇప్పటివరకు గ్లామర్ రోల్స్‌లో మెరిసిన ఆమె ఈసారి పక్కా మాస్ బీభత్సంగా నటించిందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. సినిమా మొత్తం 160 నిమిషాల రన్‌టైమ్‌తో, ఒక నిమిషం కూడా బోర్ కాకుండా మాస్ ఎలిమెంట్స్‌తో నిండిపోతుందట. రవితేజ పాత్ర కూడా ఈసారి పక్కా మాస్ అవతారంలోనే కనిపించబోతోంది. ఆయన స్టైలిష్ యాక్షన్, ఫుల్ కామెడీ టైమింగ్‌తో పాటు పవర్‌పుల్ పంచ్ డైలాగ్స్ ఈ సినిమాకి హైలైట్ కానున్నాయి. ఇప్పటికే ట్రైలర్‌లో వచ్చిన కొన్ని లైన్లు సోషల్ మీడియాలో మిలియన్ల వ్యూస్ దాటాయి.
ఈవెంట్ తర్వాత సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగిపోయాయి. రవితేజ – శ్రీలీల జోడీ ఈసారి థియేటర్లలో మాస్ ఫెస్టివల్ జరగబోతుందని అభిమానులు అంటున్నారు. ఒక మాటలో చెప్పాలంటే…‘మాస్ జాతర’ సినిమా రవితేజ ఫ్యాన్స్‌కు ఒక ఎక్సైట్‌మెంట్ ప్యాకేజీగా మారింది. శ్రీలీలతో ఆయన కెమిస్ట్రీ, రవితేజ మాస్ ఎనర్జీ, ఘాటు డైలాగులు, ఎమోషనల్ మోమెంట్స్—అన్ని కలిపి ఈసారి ఊర నాటు మాస్ ఫెస్టివల్ చూపించబోతున్నారు.ఇక థియేటర్లలో “మాస్ రాజా” స్టైల్లో “కొడతా కొడతా కొడకల్లారా!” అన్న రేంజ్‌లో అభిమానులను ఉర్రూతలూగించడానికి సిద్ధంగా ఉన్నాడు రవితేజ..!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి