ఇటీవల కాలంలో యువత అందరూ కూడా చిన్నవయసులోనే ప్రేమలో పడుతూ ఉన్నారు అని చెప్పాలి.. చదువుకునే వయసులోనే ప్రేమలో మునిగితేలుతూ చివరికి జీవితాన్ని మొత్తం నాశనం చేసుకుంటున్నారు. ఇక చదువును వదిలేసి సినిమాలు షికార్లు అంటూ తిరుగుతూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. అయితే అయితే సాధారణంగా యువకులు ఎవరైనా సరే ఇక అందమైన అమ్మాయి కనిపించింది అంటే చాలు ఏదో ఒక విధంగా ప్రపోజ్ చేసి ఇక ప్రేమలోకి దింపాలని భావిస్తూ ఉంటారు.


 అంతే కాదు ఇక కళ్ళ ముందు నుంచి ఎవరైనా అందమైన అమ్మాయి వెళ్తూ ఉంటే ఇలాంటి అందమైన అమ్మాయి ఇక ప్రియురాలుగా వస్తే ఎంత బాగుంటుందో అని ఆశపడుతూ ఉంటారు అని చెప్పాలి. ఇక లవ్ చేసే అమ్మాయి విషయంలో కూడా ఇక తమకు నచ్చిన క్వాలిటీస్ ఉన్నాయా లేవా అని చూసుకుంటూ ఉంటారు. అయితే ఇలా కాలేజీ పోరగాళ్లు అందరూ కూడా అందమైన అమ్మాయిలను ప్రేమలో పడేయడానికి పడే కష్టాలు అన్ని ఇన్ని కాదు. ఇక కొంతమంది యువకులు తమకు నచ్చిన అమ్మాయిని ప్రేమలోకి పడేస్తే ఇంకొంతమంది మాత్రం చివరికి వన్ సైడ్ లవర్స్ గానే మిగిలిపోతూ ఉంటారు.


 సాధారణంగా 19 ఏళ్ల అబ్బాయి తన వయసున్న యువతినో లేకపోతే తనకంటే ఒక ఏడాది చిన్న లేదా పెద్ద వయసున్న యువతిని ప్రేమించడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక యువకుడు మాత్రం ఏకంగా 56 ఏళ్ల మహిళతో ప్రేమలో పడ్డాడు. ప్రేమకు వయసుతో సంబంధం లేదు అంటూ చెబుతున్నాడు. థాయిలాండ్ కు చెందిన ఓ 19ఏళ్ళ యువకుడు 56 ఏళ్ల మహిళను ప్రేమ పెళ్లి చేసుకోబోతున్నాడు.  ఉద్ది చాయ్ చంత రాజ్ అనే యువకుడు తనకు 9 ఏళ్ల నుంచి పరిచయం ఉన్న 56 ఏళ్ల భామను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పి షాక్ ఇచ్చాడు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో పెద్దలను ఎదిరించి మరి ఆ బామ్మతో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి అందులో షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: