
కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్లు బీజేపీ స్వయం కృతమే ఇక్కడ ఓటమికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. యూపీఏ అవినీతి కన్నా తమ రాష్ట్రంలో జరిగిన అవినీతినే ఇక్కడ ప్రజలు ఎక్కువ సీరియస్ గా తీసుకున్నారు. కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రావటం వెనుక సామాజిక వర్గాల మద్దతు వుంది. అలాగే ప్రజల నాడిని ప్రభావితం చేసే ఆధ్యాత్మిక మఠాలు సైతం పార్టీకి అండగా నిలిచాయి. అయితే బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆ వర్గానిదే పై చేయి కావటం మిగితా వారికి రుచించలేదు.
యడ్యూరప్ప తర్వాత సదానందగౌడ్ ను ముఖ్యమంత్రిని చేసినా ఎక్కువ కాలం కుర్చీలో ఉండనీయలేదు. గాలి జనార్థన్ రెడ్డిని మైనింగ్ అక్రమాల కేసులో సీబీఐ అరెస్టు చేయటం, ఆయన స్నేహితుడు శ్రీరాములు కొత్త పార్టీ పెట్టడం జరిగిపోయాయి. ఇక పార్టీలో ఒకనాడు అన్నీ తానై వ్యవహరించిన యడ్యూరప్ప కర్నాటక జనతా పక్షను స్థాపించి బీజేపికి తీవ్ర నష్టం కలిగించాయి. లింగాయుత్ ల ప్రాబల్యం ఉండే ప్రాంతాల్లో ఓటు బ్యాంకును భారీగా చీల్చారు.