తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నలభై మూడు రోజులకు చేరుకుంది. దీంతో తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె సరికొత్త రికార్డును సృష్టించినట్లయింది. ఎందుకంటే గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో 2011 సంవత్సరంలో చేపట్టిన సకల జనుల సమ్మె 42 రోజుల వరకు సాగింది. తెలంగాణలో సుదీర్ఘకాలం పాటు జరిగిన సమ్మె  ఇప్పటివరకు సకల జనుల సమ్మెకు  మాత్రమే గుర్తింపు ఉండేది ... ఇప్పుడు తాజాగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నలభై మూడు రోజులకు చేరుకొని  ఆ రికార్డును బద్దలు కొట్టింది. కాగా  2001లో ను ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టారు కానీ అప్పట్లో ఇరవై నాలుగు రోజులు మాత్రమే ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగించారు. ప్రస్తుతం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె మాత్రం 43 రోజులకి అడుగుపెట్టి తెలంగాణ చరిత్రలోనే సుదీర్ఘకాలం పాటు కొనసాగిన సమ్మెగా  రికార్డులకెక్కింది ఆర్టీసీ సమ్మె. 

 

 

 

 

 కాగా  వివిధ డిమాండ్లతో తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ఆర్టీసీ సమ్మె రాష్ట్రంలో రోజురోజుకు ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఈ క్రమంలోనే నిన్న రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఆందోళనల్లో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కరీంనగర్ శివారులోని తీగల గుట్టపల్లి  లో ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ ఇంటిని  ముట్టడించేందుకు ప్రయత్నించారు. కాగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఆర్టీసీ కార్మికులు అందరూ గేటు వద్ద బైఠాయించి ధర్నా నిర్వహించారు . నిజాంబాద్ నిర్మల్ భైంసా డిపోల వద్ద  కూడా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు అందరూ బస్సులను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేశారు. ఉమ్మడి కరీంనగర్ లోనూ ఇలాంటి ఆందోళనలు కొనసాగాయి . 

 

 

 

 ఖమ్మంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు ఆర్టీసీ కార్మికులు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. కాగా  ఆర్టీసీ కార్మికులు ప్రవేశపెట్టిన భవిష్యత్ కార్యాచరణలో భాగంగా నేడు నిరాహార దీక్ష చేయనున్నట్లు ప్రకటించిన ఆర్టీసీ జేఏసీ నేతలు...  ఇప్పుడు నిర్ణయం మార్చుకుని నేడు  బస్సు రోకో  కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.దీంతో  రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తమైన పోలీసులు ఎక్కడికక్కడ 144 సెక్షన్ విధించాలి  అంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా అటు  హైకోర్టులో కూడా ఆర్టీసీ సమ్మె పై విచారణ  జరుగుతున్నప్పటికీ వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: