రాజధాని భూముల సేకరణపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో చంద్రబాబు ప్రభుత్వం కొంత ఇరుకునపడింది. రైతులకు ఇష్టం లేకుండా భూములు తీసుకోవద్దని కోర్టు చెప్పింది. ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది... రాజధాని నిర్మాణానికి అవరోధమా.. కాదా.. అనే విషయాల్లో ప్రభుత్వం ఇంకా స్పష్టమైన అంచనాలకు, నిర్ణయాలకు రాలేదు. అయితే, ఈలోగానే పులిమీద పుట్రలా జాతీయ స్థాయి సామాజిక ఉద్యమకారులు ఏపీ రాజధాని ప్రాంతంలోకి దిగుతున్నారు. ఇక వారెంత గొడవ చేస్తారో... ఏ లిటిగేషన్ పెడతారో అని ఏపీ గవర్నమెంటు ఆందోళన చెందుతోంది

ఉద్యమ కారిణి మేథా పఠ్కర్‌ 

Image result for medha patkar

ప్రముఖ సామాజిక ఉద్యమ కారిణి మేథా పఠ్కర్‌ ఏప్రిల్ 9 నుంచి రాజధాని గ్రామాల్లో పర్యటించను న్నారు. ఇంతవరకు ఆ స్థాయి ఉద్యమకారులు దీనిపై పెద్దగా దృష్టి పెట్టలేదు... ఇప్పుడు ఆమె వస్తుండడంతో దీన్ని జాతీయ స్థాయి సమస్యగా మలచి ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం చేస్తున్న భూసమీకరణను తాము వ్యతిరేకి స్తున్నట్లు పెనుమాక, ఉండవల్లితో పాటు మరో నాలుగు గ్రామాలకు చెందిన రైతులు ఆందోళన చేస్తున్నారు. అయితే, వీరి ఆందోళనను ప్రభుత్వం ఖాతరు చేయకుండా భూసమీకరణ ప్రక్రియను చేసుకుపోతోంది.

రాజధాని గ్రామాల్లో 

Image result for ap capital thullur

ఈ విషయమై రైతులు జారీ చేస్తున్న ఆందోళన జాతీయ స్ధాయికి చేరుకున్నది.ఇందులో భాగం గానే వివిధ ప్రజా సంఘాలు, న్యాయవాదుల బృందాలు, రాజకీయ పార్టీలు సైతం రాజధాని గ్రామాల్లో పర్యటించాయి. అయినా, ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతూనే ఉంది. ఈ నేపథ్యంలో పెనుమాకరైతుల్లో కొందరు భూసమీ కరణకు వ్యతిరేకంగాన్యాయస్ధానాన్ని ఆశ్రయించా రు. ఇష్టం లేకుండా రైతుల భూములను స్వాధీనం చేసుకోవద్దని గురువారం న్యాయస్ధానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపధ్యంలో వచ్చే నెల 9వ తేదీన ప్రముఖ సామాజిక ఉద్య మకారిణి, నర్మదా బచావో ఉద్యమ నేత మేథాపాఠ్కర్‌ రాజధాని గ్రామాల్లో పర్యటించనుండడం ప్రాధాన్యం సంతరించుకుంటుంది. మేధా రాకతో ఈ సమస్య జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తుందని... తమకు న్యాయం జరుగుతుందని రైతులు ఆశిస్తుండగా.... ఈ ఉద్యమకారులు దీన్ని ఎంత పెద్ద సమస్యగా మారుస్తారో.... ఎలాంటి టర్ను తిప్పుతారో అని ప్రభుత్వం కొంత ఆందోళనకు గురవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: