గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమితో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణుల్లో నెలకొన్న నైరాశ్యం కాస్త ఇటీవల భూసవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఏఐసిసి చేపట్టిన కిసాన్‌ ర్యాలీతో కనుమరుగవుతోంది. మొన్నటి వరకు ఇక కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగితే రాజకీయ భవిష్యత్‌ అగమ్యగోచరం అని భావించిన ఆ పార్టీ నేతల్లో కిసాన్‌ ర్యాలీ కాస్త జోష్‌ నింపింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏఐసిసి స్థాయిలో నాయకత్వ మార్పుపై కూడా గత కొంతకాలంగా కాంగ్రెస్‌ పార్టీ జాతీయ స్థాయి నేతలు సైతం పలురకాల డిమాండ్లను తెరపైకి తీసుకొచ్చిన విషయం తెలసిందే. రాహుల్‌ నాయకత్వంపై కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తంచేసి పార్టీ పగ్గాలు ప్రియాంక గాంధీకి అందించాలని ఆ పార్టీలో డిమాండ్‌ రేకెత్తించిన విషయం తెలిసిందే. కానీ కొంత కాలం అజ్ఞాతం తరువాత ఒక్కసారిగా కిసాన్‌ ర్యాలీకి కొన్ని రోజుల ముందు తెరపైకి తీసుకొచ్చి, ఎన్‌డిఏకు వ్యతిరేకంగా చేపట్టిన రైతు ర్యాలీని విజయవంతం చేయడలో రాహుల్‌గాంధీ సఫలీకృతం అయ్యారని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎట్టకేలకు రాహుల్‌గాంధీ తన నాయకత్వ పట్టిమను కిసాన్‌ ర్యాలీతో నిరూపించుకొన్నారని ఏఐసిసి స్థాయి నేతలు సైతం వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదిలావుంటే దేశవ్యాప్తంగా ఎన్‌డిఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన ర్యాలీకి భారీ ఎత్తున్న రైతులు హాజరుకావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం కలిగింది. ఈ ర్యాలీతో తమ పార్టీకి ఇంకా రాజకీయ భవిష్యత్తు ఉందన్న నమ్మకం తమలో పెరుగుతోందని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

కిసాన్‌ ర్యాలీతో కాంగ్రెస్‌ పార్టీలో ధీమా పెరగడానికి ఓ లెక్కుందని రాజకీయ వర్గాలు సైతం వ్యాఖ్యనిస్తున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌సభలో కనీసం ప్రతిపక్ష హోదాను సైతం సాధించుకోలేని ఓటమిని కాంగ్రెస్‌ చవిచూసింది. ఈ పరిస్థితుల్లో ఇక కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్తంగా అయిపోయిందని, ఇతర పార్టీలతో కలసి ఆ పార్టీ కూటమి కట్టాల్సిందేనని రాజకీయ వర్గాల్లో చర్చ సాగింది. ఆ దిశగానే కొన్ని రాషా్టల్ర ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం ఇతర పార్టీలకు స్నేహాస్తం కూడా అందించింది. కానీ ఎన్‌డిఏ సర్కార్‌ సవరణ చేసి తీసుకొచ్చిన భూ సేకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఏఐసిసి నాయకత్వం స్వతహాగా ఒంటరిగా ఈ ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఇలా ఒంటరిగా పిలుపునిచ్చిన ఆ పార్టీ కార్యక్రమం విజయవంతం కావడంతో ఇంకా తమ పార్టీకి దేశవ్యాప్తంగా ఇమేజ్‌ ఉందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.అధికారం కోల్పోయిన రాషా్టల్ర పిసిసి అధ్యక్షులు సైతం ఈ ర్యాలీ విజయవంతంతో ఆనందం, పార్టీ భవిష్యత్‌పై ధీమా వ్యక్తంచేస్తున్నారు. ఎన్‌డిఏ సర్కార్‌కు అనతికాలంలోనే దేశవ్యాప్తందా రైతుల్లో వచ్చిన వ్యతిరేకతకు, తిరిగి కాంగ్రెస్‌ను వారు ఆదరిస్తున్నారన్న దానికి ఈ కిసాన్‌ ర్యాలీ ఓ నిదర్శనమని వారు పేర్కొంటున్నారు. ఈ ర్యాలీ విజయవంతంతో కాంగ్రెస్‌ పార్టీ తిరిగి పుంజుకొంటుందని ఆ పార్టీ వర్గాలు ధీమా వ్యక్తంచేస్తున్నాయి.


గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి ఆపై జరిగిన రాషా్టల్ర ఎన్నికల్లో ఓటమితో రాహుల్‌ నాయకత్వంపై ఆ పార్టీలో కొందరు భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రాహుల్‌గాంధీని తప్పించి ప్రియాంక గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించాలని కొందరు కోరితే, మరికొందరు సోనియాగాంధీ చేతుల్లోనే నాయకత్వ బాధ్యతలు ఉండాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత వ్యవహారంగా కొనసాగుతున్న ఈ వివాదాన్ని అస్త్రంగా మల్చుకొని బిజెపి నేతలు రాహుల్‌గాంధీపై విమర్శనాసా్తల్రు సంథించారు. రాహుల్‌గాంధీ సొంత పార్టీని చక్కపెట్టుకోవాలని, ఆయన నాయకత్వాన్ని కాంగ్రెస్‌ నేతలే అంగీకరించడం లేదని ఆ పార్టీని బిజెపి నేతలు ఇరకాట పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో కొంత కాలం రాహుల్‌గాంధీ అజ్ఞాతంలోకి వెళ్లడం, ఆ పార్టీ తెరపైకి వచ్చి కిసాన్‌ ర్యాలీని విజయవంతం చేయడం వంటి పరిణామాలు చోటుచేసుకొన్నాయి. ఈ కిసాన్‌ ర్యాలీ వేదికగా ఎన్‌డిఏ సర్కార్‌పై రాహుల్‌గాంధీ నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపైనా విమర్శనాస్త్రలు సంథించారు. ఈ నేపథ్యంలో రాహుల్‌గాంధీ తన నాయకత్వ పట్టిమను నిరూపించుకొన్నారని , ఆయన నాయకత్వంలో పార్టీ భవిష్యత్తు బాగుంటుందని విశ్వసిస్తున్నామని కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ధీమాను వ్యక్తంచేస్తున్నాయి. రాహుల్‌గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టి భూ సవరణ బిల్లు వ్యతిరేక కిసాన్‌ ర్యాలీ విజయవంతం కావడంతో మున్ముందు యువరాజు ఇదే పంథాను అనుసరిస్తారని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే స్పీడు, పంథాను రాహుల్‌గాంధీ కొనసాగిస్తే మాత్రం కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్తంగా పుంజుకోవడమే కాకుండా ఎన్‌డిఏ సర్కార్‌కు ఈ ఐదేళ్లలో కాంగ్రెస్‌ పార్టీయే ఏకైక ప్రత్యామ్నాయం అవుతుందని వారు ధీమాను వ్యక్తంచేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: