రేవంత్ రెడ్డి రాకతో తెలంగాణ కాంగ్రెస్ లో ఎంతో క్రేజ్ వచ్చిందని చెప్పవచ్చు. అదే క్రేజ్ తో రేవంత్ కూడా సరైన వ్యూహాలతో కాంగ్రెస్ పార్టీని  ఎలాగైనా గెలిపించాలని  ముందుకు పోతున్నారు. ఈ సందర్భంలోనే ఆయనకు బయటి పోరు కంటే ఇంటిపోరు ఎక్కువైనట్టు కనిపిస్తోంది. మొన్నటి వరకు కోమటిరెడ్డి బ్రదర్స్ తో ఇబ్బంది పడ్డా ఆయన మళ్లీ జగ్గారెడ్డి రూపంలో సతమతమవుతున్నారు. చివరకు ఈ వ్యవహారమంతా కాంగ్రెస్ అధిష్టానానికి చేరింది. మరి వారు ఏ నిర్ణయం తీసుకున్నారో తెలుసుకుందామా..? దీంతో కాంగ్రెస్ అధిష్టానం  నిన్న మొన్నటి వరకు టిపిసిసి రేవంత్ రెడ్డి పై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి సడన్ గా సైలెంట్ అయిపోయారు. కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చిన ఝలక్ తో యూ టర్న్ తీసుకున్నారు. కోపంలో ఏదో అంటామని అవతలి వ్యక్తులను ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడితే వెనక్కి తీసుకుంటానని అన్నారు జగ్గారెడ్డి.

కాంగ్రెస్ పార్టీలో ముత్యాలముగ్గు సినిమాలో హీరోయిన్ లా తన పరిస్థితి మారిపోయిందని అన్నారు జగ్గారెడ్డి. ఇది కాంగ్రెస్ పంచాయతీ కాదని, తనకు, రేవంత్ రెడ్డికి మధ్య గుణగణాల పంచాయతీ అని  చెప్పారు జగ్గారెడ్డి. టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో కలిసి పని చేసేందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నియమించిన ఏ వ్యక్తితోనైనా కలసి పని చేస్తానని చెప్పారు జగ్గారెడ్డి. అయితే రేవంత్ రెడ్డి పైన పంచులు పేల్చారు జగ్గారెడ్డి. చంద్రబాబు దగ్గర రేవంత్ రెడ్డి ఏం రాజకీయం నేర్చుకున్నాడో అని సెటైర్లు వేశాడు.

రేవంత్ రెడ్డి మెదక్ పర్యటనకు పిలవకపోవడంపై మండిపడ్డారు. మరోవైపు కాంగ్రెస్ రాజకీయం హస్తినకు చేరింది. టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితోపాటు, వి.హెచ్.హనుమంతరావు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, reddy NALAMADA' target='_blank' title='ఉత్తమ్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలోనే మకాం వేశారు. అయితే వీరికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అపాయింట్మెంట్ ఖరారు కాలేదని తెలుస్తోంది. మాణిక్యం ఠాగూర్ తో పాటు కాంగ్రెస్  అగ్రనేతలను కలిసిన రేవంత్ రెడ్డి తాజా రాజకీయాలపై చర్చించినట్లుగా సమాచారం. జగ్గారెడ్డి వ్యవహారం, పార్టీ పరిస్థితులను అన్నిటినీ అధిష్టానానికి రేవంత్ రెడ్డి వివరించినట్లుగా చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: