రోజురోజుకు తెలుగుదేశంపార్టీ చాలా విచిత్రంగా వ్యవహరిస్తోంది. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది కష్టమనుకున్నారో లేకపోతే వచ్చేది లేదని అనుకున్నారో తెలీదు కానీ ఇపుడు మాత్రం శాడిజంతోనే వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. విషయం ఏమిటంటే మంగళవారం నుండి ప్రభుత్వం సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా  గ్రీవెన్సె సెల్ 1902ను ఏర్పాటుచేసింది. దీనికి ‘జగనన్నకు చెబుదాం’ అని పేరుపెట్టింది.




కార్యక్రమం ఉద్దేశ్యం ఏమిటంటే జనాలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కారాలను అందుకోవటం. చెప్పుకునే సమస్యల్లో వ్యక్తిగతం ఉండచ్చు లేదా సామూహిక సమస్యలు అంటే రోడ్లు, వీధిలైట్లు లేకపోవటం, తమ ప్రాంతంలో  రేషన్ సరిగా అందకపోవటం, చెత్తకుప్పలు పేరుకుపోవటం వల్ల అనారోగ్యాలు సోకుతుండటం ఏదైనా కావచ్చు. అంటే 1902కి అచ్చంగా జనాలు ఫోన్ చేసి పరిష్కారాలను అందుకోవాలని.



అయితే టీడీపీ ఇక్కడే నీచరాజకీయానికి తెరలేపిందని జగన్ మీడియా చెప్పింది. టీడీపీ ఆఫీసు నుండి వర్లరామయ్య 1902కి తాను ఫోన్ చేయటమే కాకుండా ఒకేసారి 20 మందితో ఫోన్ చేయించారట.  హెల్ప్ లైన్ ఉద్యోగులతో అసభ్యంగా, ఎగతాళిగా వర్ల మాట్లాడారట. ఫోన్ తీసిన హెల్ప్ లైన్ ఉద్యోగితో నీ పేరేంటి ? నీ ఫోన్ నెంబర్ ఏమిటి ? అని అడిగారట. నీ దుంపతెగ నువ్వు చాలా తెలివైన వాడివయ్యా.. నా సమస్యను జగనన్నకు చెప్పే అవకాశం లేదా..అన్నీ సమస్యలను పరిష్కరించేస్తామన్నారుగా అంటు ఎగతాళిగా మాట్లాడారట.



నిజంగా సమస్యలు చెప్పుకోవటానికి ఫోన్ చేసిన వాళ్ళెవరు హెల్ప్ లైన్ లో మాట్లాడే వాళ్ళ పేర్లు, ఫోన్ నెంబర్లు అడగరు. ఎందుకంటే మాట్లాడే ప్రతి సంభాషణ రికార్డవుతుంది కాబట్టి. సీఎం జగన్ అవినీతికి పాల్పడుతున్నారు ఫిర్యాదు రాసుకో అంటు దబాయించి మాట్లాడారాట. వర్ల మాట్లాడిన తీరుతోనే జగనన్నతో మాట్లాడుదాం అనే కార్యక్రమాన్ని గబ్బుపట్టిద్దామన్న ఆలోచన తప్ప ఇంకోటి కనబడలేదు. గతంలో కూడా అవినీతిని కంట్రోల్ చేయటం కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను ప్రకటిస్తే అప్పుడు కూడా వర్ల ఇలాగే ఫోన్ చేసి విసిగించటం, ఎగతాళిగా మాట్లాడటం గుర్తుండే ఉంటుంది. అవతలి వాళ్ళు ఫోన్ పెట్టేయగానే ప్రభుత్వ కార్యక్రమం అంతా బోగస్ అని మీడియాలో గోలచేయటం వర్ల లాంటి వాళ్ళకే చెల్లుతుంది.




మరింత సమాచారం తెలుసుకోండి: