ఒక పార్టీ అధికారం లో ఉంది అంటే చాలు.. ఇక ఆ పార్టీకి చెందిన నాయకులందరూ కూడా ఎన్నికల్లో పోటీ చేయాలని తెగ ఆశపడుతూ ఉంటారు. దీంతో అధికారం లో ఉన్న పార్టీకి ఎప్పుడు ఆశావాహుల నుంచి తలనొప్పులు ఎదురవుతూనే ఉంటాయ్ అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించి అధికారాన్ని చేపట్టింది కాంగ్రెస్ పార్టీ.


టిఆర్ఎస్ కంచు కోటలను సైతం బద్దలు కొట్టి ప్రభంజనమే సృష్టించింది అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యం లో కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పులు తప్పడం లేదు. ఎందుకంటే ఇక పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాలు ఉండగా ఈ 17 స్థానాలకు తీవ్రమైన పోటీ ఉంది. కాగా ఇప్పటికే 9 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఇంకో ఎనిమిది మంది అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అభ్యర్థుల ప్రకటనలో తమకే తప్పకుండా అవకాశం దక్కుతుందని ఎంతో మంది గట్టిగా నమ్మకం పెట్టుకున్నారు.


 అయితే ప్రస్తుతం ఖమ్మం నియోజకవర్గం లో కూడా పరిస్థితి ఇలాగే ఉంది అన్నది తెలుస్తుంది. కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ లోనే తీవ్రమైన పోటీ ఉంది. మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సతీమణి భట్టి రంజని ఇక ఖమ్మం ఎంపీ టికెట్ తమకే వస్తుంది అంటూ ధీమాతో ఉన్నారు. ఇంకోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత పిహెచ్ సైతం బీసీ కోటాలో తనకు టికెట్ కేటాయించాలని కోరుతున్నాడు. ఇలా అక్కడ ఎవరికీ టికెట్ ఇచ్చిన భారీ మెజారిటీతో కాంగ్రెస్ విజయం సాధించే పరిస్థితులు ఉన్నాయి. అందుకే అంతటి తీవ్రమైన పోటీ ఉంది. మరి కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి టికెట్ ఇవ్వబోతుంది అన్నది హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: