
ఇంతకీ దయ్యాలు ఉన్నాయా లేవా అంటే ఇప్పటికీ ఎవరు ఉన్నాయి మేము చూశామని కచ్చితంగా సమాధానం చెప్పలేరు. కానీ మన పెద్దల ను అడిగితే మాత్రం ఇక దెయ్యాల గురించి కథలు కథలుగా ఎన్నో చెబుతూ ఉంటారు. వాళ్లు చెప్పిన కథలు విన్న తర్వాత మాత్రం ఇక రాత్రి కూడా నిద్ర పట్టదు అని చెప్పాలి. అది సరే గానీ ఇక ఇప్పుడు దయ్యాలు భూతాల గురించి ఎందుకు మాట్లాడు కోవాల్సి వచ్చింది అనే కదా మీ డౌట్. అప్పుడప్పుడూ కొన్ని ప్రాంతాల్లో వింత శబ్దాలు రావడంతో స్థానికులు అందరినీ భయబ్రాంతులకు గురి చేయడం ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. ఇక్కడ ఇక ఇలాంటి తరహా ఘటన జరిగింది.
మహబూబాబాద్ లో ఏ రకంగా దయ్యాల భయం కలకలం సృష్టించింది. ట్రైబల్ వెల్ఫేర్ బాలికల డిగ్రీ కాలేజ్ హాస్టల్ లో వింత శబ్దాలు వినిపిస్తున్నాయ్ అని విద్యార్థునులు ఆందోళన చేపట్టారు. అయితే ఆ అర్ధరాత్రి కాగానే వింత శబ్దాలు వస్తున్నాయని దీంతో భయంతో వణికిపోతూన్నామని అంటున్నారు విద్యార్థులు. ఈ వింత శబ్దాలు కారణంగా భయపడిపోతూ కనీసం చదువుపై కూడా ఏకాగ్రత పెట్టలేక పోతున్నాం అని అంటున్నారు. అయితే ఇక దీనిపై విచారణకు ఆదేశించారు అధికారులు. అంతే కాకుండా విద్యార్థులకు జన విజ్ఞాన వేదిక ద్వారా కౌన్సిలింగ్ ఇవ్వాలి అంటూ అధికారులు ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.