
పాకిస్తాన్ శ్రీలంక చేతిలో ఓడడంతో ఇప్పుడు శనివారం ఇండియా మరియు శ్రీలంక ల మధ్యన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే టోర్నీ మొదటి నుండి కప్ ను సాధించగలిగే జట్టుగా ఇండియాను చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇక ఆ క్షణం రానే వచ్చింది. అయితే శ్రీలంక కు ప్రధాన ఆయుధం బౌలింగ్ అని చెప్పాలి. కేవలం ఒక్క ఫేస్ బౌలర్ మాత్రమే ఉన్నారు. మిగిలిన వారంతా కూడా స్పిన్నర్ లు కావడం విశేషం.. ఎందుకంటే ఈ టోర్నీలో తమ ఆటతీరు ఎలా ఉంది. ముఖ్యంగా శ్రీలంక కెప్టెన్ మరియు ఓపెనర్ అటపట్టు ఫామ్ లో లేకపోవడం ఆ జట్టుకు చాలా నష్టాన్ని కలిగిస్తుంది అని చెప్పాలి.
అయితే ఆఖరి మ్యాచ్ లో కనుక ఆటపట్టు ఫామ్ ను దొరకబుచ్చుకుని ఆడితే ఇండియా కు కష్టాలు తప్పవు. కాగా స్మృతి మందన్న తన స్థాయికి తగినట్లు ఆడడం లేదు. హర్మన్ సైతం దొరికిన ఆరంభాలను పెద్ద స్కోర్ లుగా మలుచుకోలేకపోతోంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఆసియా కప్ ఇండియా కు దక్కడం పక్కా ! మరి ఇండియా అసలైన ఆటతీరును చూపించి కప్ ను సాధిస్తుందా లేదా చూడాలి.