
ఇలా భారత జట్టులోకి కొత్తగా వచ్చే ఆటగాళ్లు మాత్రమే కాదు ఒకప్పుడు భారత జట్టులో చోటు సంపాదించుకుని ఇక ఆ తర్వాత ఫామ్ కోల్పోయి కనుమరుగైన వాళ్ళు కూడా పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడుతూ మళ్లీ తమ ఫామ్ నిరూపించుకుని టీమ్ ఇండియాలోకి వస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే గత కొంతకాలం నుంచి ఎంతోమంది ఆటగాళ్లు రాంజీ ట్రోఫీలో భాగంగా సెంచరీలతో చెలరేగిపోతున్నారు అని చెప్పాలి. ఇక కొంతమంది ఆటగాళ్లు అయితే డబుల్ సెంచరీలు కూడా చేస్తూ ఔరా అనిపిస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే టీమిండియా క్రికెటర్ మనీష్ పాండే సైతం ఇక ఇటీవల రంజీ ట్రోఫీలో భాగంగా అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. దీంతో వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయాడు అని చెప్పాలి.
గత కొంతకాలం నుంచి టీమ్ ఇండియాలో అవకాశం కోసం నిరీక్షణగా ఎదురుచూస్తున్న మనీష్ పాండే ఇటీవల రంజీ ట్రోఫీలో భాగంగా తనలో ఉన్న కసి మొత్తాన్ని బ్యాటింగ్ రూపంలో చూపించాడు. ఈ క్రమంలోనే ఏకంగా అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో డబుల్ సెంచరీ చేశాడు అని చెప్పాలి. రంజీ ట్రోఫీలో భాగంగా గోవాతో జరిగిన మ్యాచ్లో మనీష్ పాండే కర్ణాటక తరఫున ప్రాతినిధ్యం వహించాడు. కేవలం 183 బంతుల్లోనే 14 ఫోర్లు 11 సిక్సర్లతో 208 పరుగులు చేసి నాట్ అవుటుగా నిలిచాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే మనిషి పాండే అద్భుతమైన డబుల్ సెంచరీ పై ప్రస్తుతం అభిమానులు అందరూ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.