
అయితే తాము ప్రేమలో లేము అన్న విషయాన్ని పలుమార్లు వీరిద్దరూ మీడియా ముందే చెప్పేసారు. అయినప్పటికీ మీడియా మాత్రం వీరు నిజంగానే ప్రేమలో ఉన్నారు అంటూ ప్రచారం మొదలు పెట్టింది. ఆ తర్వాత కాలంలో గిల్ ప్రేమలో ఉంది సచిన్ కూతురుతో కాదు సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ తో అంటూ మరో వార్త హల్చల్ చేసింది. అయితే ఈ ఇద్దరి సారాలలో ఎవరితో గిల్ ప్రేమలో ఉన్నాడు తెలియక ఇక నేటిజన్స్ అందరూ కూడా కన్ఫ్యూషన్ లో మునిగిపోయారు అని చెప్పాలి. అయితే ఇటీవలే వాలెంటెన్స్ డే రోజున శుభమన్ గిల్ పెట్టిన ఒక పోస్ట్ కాస్త అతని లవ్ మేటర్ ను రివిల్ చేసేసారు.
శుభమన్ గిల్ ఎన్నో రోజుల నుంచి సారా టెండూల్కర్ తో రిలేషన్ షిప్ లో ఉన్నాడు అన్న వార్త నిజమే అన్న విషయంపై అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. ఇటీవల వాలెంటెన్స్ డే రోజున ఒక ఫోటో పోస్ట్ చేస్తూ what day is it again? అనే ఒక పదాన్ని జోడించాడు గిల్. ఈ పోస్టులో ఏముంది అనుకుంటున్నారు కదా. ఈ ఫోటోలో గిల్ ఓ రెస్టారెంట్ లో కాఫీ తాగుతూ కనిపించాడు. అయితే గతంలో ఇదే ప్లేస్ లో దిగిన ఫోటోని సారా టెండూల్కర్ సోషల్ మీడియాలో పెట్టింది. దీంతో ఇక గిల్ పొరపాటున లవ్ మేటర్ బయటపెట్టేసాడు అంటూ ఎంతో మంది కామెంట్లు చేస్తున్నారు.