
ఈ క్రమంలోనే ప్రస్తుతం వరుస విజయాలతో పాయింట్లు పట్టికలో కూడా టాప్ ప్లేస్ లో కొనసాగి ఇప్పటికే సెమీఫైనల్ బెర్త్ ను కూడా కన్ఫార్మ్ చేసుకుంది అని చెప్పాలి.. అయితే సెమి ఫైనల్ లో అడుగు పెట్టినప్పటికీ ఇంకా కసి తీరలేదు అన్నట్లుగా ప్రత్యర్థిని చిత్తుగా ఓడిస్తూ ఉండడం చూస్తూనే ఉన్నాం. ఇకపోతే ఇటీవల ఉమెన్స్ టి20 వరల్డ్ కప్ చరిత్రలోనే ఎవరికి సాధ్యం కానీ ఒక అరుదైన రికార్డును ఇటీవల ఇంగ్లాండు జట్టు సాధించింది. ఇటీవలే జరిగిన ఒక మ్యాచ్ లో ఏకంగా మహిళల టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యధిక స్కోరును నమోదు చేసింది ఇంగ్లాండు . దీంతో ప్రస్తుతం అద్భుతమైన ప్రదర్శన చేసిన ఇంగ్లాండ్ ప్లేయర్లపై ప్రస్తుతం అందరూ మాజీ ప్లేయర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇటీవలే పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు ఇక చరిత్ర సృష్టించింది అని చెప్పాలి. ఈ మ్యాచ్ లో భాగంగా తొలుత బ్యాటింగ్ చేసింది పటిష్టమైన ఇంగ్లాండు. అయితే ఆరంభంలో వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయినప్పటికీ అద్భుతంగా పుంజుకుంది అని చెప్పాలి. 20 ఓవర్లు ముగిసే సరికి ఐదు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. అయితే ఇది టి20 మహిళల వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. అయితే గతంలో థాయిలాండ్ పై సౌత్ ఆఫ్రికా చేసిన 195 పరుగులు ఇప్పటివరకు వరల్డ్ కప్ లో అత్యధిక స్కోరుగా కొనసాగింది. ఇప్పుడు ఇంగ్లాండ్ జట్టు ఈ రికార్డును బద్దలు కొట్టింది అని చెప్పాలి.