టీ 20 వరల్డ్ కప్ 2023 లో మరో రెండు మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉన్నాయి. పది జట్లతో మొదలైన ఈ టోర్నీ కాస్త మూడు జట్లకు పరిమితం అయింది. ఆస్ట్రేలియా , ఇండియా , ఇంగ్లాండ్ మరియు సౌత్ ఆఫ్రికా లు మాత్రమే సెమీస్ పోరుకు అర్హత సాధించగా , నిన్న జరిగిన మొదటి సెమీఫైనల్ లో ఇండియాను ఆస్ట్రేలియా అయిదు పరుగుల తేడాతో ఓడించి ఘనంగా ఫైనల్ లోకి అడుగు పెట్టింది ఆస్ట్రేలియా. మ్యాచ్ లో పలు మార్లు విజయం రెండు జట్ల మధ్య దోబూచులాడి చివరికి ఆస్ట్రేలియా మహిళలనే వరించింది. కాగా ఈ రోజు నిన్న జరిగిన స్టేడియంలోనే ఇంగ్లాండ్ మరియు సౌత్ ఆఫ్రికా ల మధ్యన రెండవ సెమీఫైనల్ జరగనుంది.

ఈ మ్యాచ్ లోనూ ఇంగ్లాండ్ ఫేవరెట్ టీం గా చెప్పుకోవచ్చు. ఇంగ్లాండ్ ఆయుధం ఫియర్ లెస్ క్రికెట్ ఆడడమే అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ప్రత్యర్థి ఎంతటి బలంగా ఉన్నా తాము ఎదురుదాడి చేసి దెబ్బ తీయడం అలవాటు. అందుకే ఇటీవల వీరి ఆటతీరు బాగా మెరుగయింది, హెదర్ నైట్ సారధ్యంలోని ఇంగ్లాండ్ మహిళల జట్టు మూడు విభాగాల్లోనూ బలంగా ఉంది. ఛేజింగ్ అయినా డిఫెండింగ్ అయినా గెలిచే అవకాశాలు మాత్రం ఇంగ్లాండ్ కే ఎక్కువగా ఉన్నాయన్నది కాదనలేని వాస్తవం. ఇక అనూహ్యంగా సెమీస్ కు చేరుకున్న సౌత్ ఆఫ్రికా ఫైనల్ చేరుకోవాలంటే మరోసారి అదృష్టం తోడుకావాల్సిందే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.

ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా మహిళల జట్టులో అద్భుతమైన ఫామ్ లో ఉండే లారా వోల్వర్ట్ వరల్డ్ కప్ లో మాత్రం చాలా నిరాశాజనకంగా ప్రదర్శన చేస్తుండడం సూత్ ఆఫ్రికా అభిమానులను బీదకు గురిచేసిందని చెప్పాలి. సౌత్ ఆఫ్రికా సాధించిన విజయాలలో ఈమెదే కీలక పాత్ర. కానీ ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్ లలో కేవలం 116 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన జాబితాలో 15 వ స్థానంలో ఉంది. ఈరోజు మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా లో వోల్వర్ట్, కప్, ట్రయన్, సన్ లస్ లు కనుక నిలకడగా రాణిస్తే ఇంగ్లాండ్ ను ఓడించి ఫైనల్ చేరడం సులభం అవుతుంది. మరి వచ్చిన ఈ మంచి అవకాశాన్ని సౌత్ ఆఫ్రికా మహిళల జట్టు ఉపయోగించుకుని ఫైనల్ చేరుతుందా చూడాలి.      

మరింత సమాచారం తెలుసుకోండి: