
అందుకే ఈ టెస్ట్ సిరీస్ కు ఇషాన్ కిషన్ మరియు శ్రీకర్ భరత్ లను టీం మేనేజ్మెంట్ తీసుకుంది. ఇక ఇప్పటి వరకు ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టెస్ట్ లకు తుది జట్టులోకి శ్రీకర్ భరత్ నే తీసుకుంది. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు జట్టులో ఉన్న పోటీ చూస్తే ఇది భరత్ కు దొరికిన సువర్ణ అవకాశం అని చెప్పాలి. కనీసం ఈ సీరీస్ లో 40 సగటుతో పరుగులు చేసినా తన ఎంపికకు న్యాయం చేసినట్లే... కానీ పరిస్థితి వేరేలా ఉంది. ఇప్పటి వరకు ఆడిన మూడు టెస్ట్ లలో శ్రీకర్ భరత్ ప్రదర్శన చూస్తే చాలా దారుణంగా ఉంది. ఢిల్లీ లో జరిగిన మొదటి టెస్ట్ లో ఒక్క ఇన్నింగ్స్ లోనే బ్యాటింగ్ చేసే అవకాశం రాగా 8 పరుగులు చేసి ఔటయ్యాడు. నాగపూర్ లో జరిగిన రెండవ టెస్ట్ లో రెండు ఇన్నింగ్స్ లలో వరుసగా 6 మరియు 23 పరుగులు చేశాడు.
ఇక ఈ రోజు ముగిసిన ఇండోర్ లోని మూడవ టెస్ట్ లో రెండు ఇన్నింగ్స్ లలో కలిపి 20 పరుగులు మాత్రమే చేసి విమర్శలకు తానే అవకాశం ఇచ్చాడు. ఇక కీపింగ్ లో తీసుకుంటే ఇప్పటి వరకు 5 క్యాచ్ లు మరియు ఒక స్టంపింగ్ చేసి పర్వాలేదనిపించాడు. అలా మూడు టెస్ట్ లలో బ్యాటింగ్ లో 57 పరుగులు చేసి దారుణమైన ప్రదర్శన చేశాడు. ఇక నాలుగవ టెస్ట్ లో భరత్ కు చేతో దక్కడం దాదాపు అనుమానమే అని చెప్పాలి. ఇండియా టెస్ట్ జట్టులో చోటు దక్కడం అంత ఈజీ కాదు. కానీ దొరికిన బంగారం లాంటి అవకాశాన్ని తానే చేతులారా మట్టి పలు చేసుకున్నాడు.