
ఇక ఢాకాలో జరిగిన రెండవ మ్యాచ్ లో ఇంగ్లాండ్ మరీ దారుణంగా కేవలం 117 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఈ స్కోర్ ను బంగ్లా ఆటగాళ్లు ఆడుతూ పాడుతూ మరో ఓవర్ మిగిలి ఉండగా చేధించారు. ఇక ఈ రోజు జరిగిన చివరి మ్యాచ్ లో టాస్ ఒడి మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్ లలో రెండు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. బంగ్లా ఆటగాళ్లలో ఓపెనర్ లిటన్ దాస్ 73 పరుగులు, శాంటో 47 పరుగులు మరియు తాలూక దార్ 24 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ కు ఉన్న బ్యాటింగ్ లైన్ అప్ కు ఈ స్కోర్ ను ఛేదించడం కష్టం కాదు.
కానీ సొంత పిచ్ పై బంగ్లా బౌలర్లు చెలరేగడంతో ఇంగ్లాండ్ తోకముడవక తప్పలేదు. ఇంగ్లాండ్ మొత్తం ఓవర్ లు ఆడి 6 వికెట్ల నష్టానికి 142 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలయ్యారు. ఇంగ్లాండ్ లాంటి జట్టు బంగ్లాదేశ్ లాంటి జట్టుపైన టీ 20 సిరీస్ క్లీన్ స్వీప్ గా కోల్పోవడం చాలా బాధాకరం. మరి ఈ టోర్నీ తర్వాత ఇంగ్లాండ్ తమలో ఉన్న నెగేటివ్స్ ను ఏ విధంగా సర్దుబాటు చేసుకుంటుందో చూడాలి.