
మొన్నటికి మొన్న ఆస్ట్రేలియా తో జరిగిన టెస్ట్ సిరీస్ లో కూడా అద్భుతంగా రాణించిన మహమ్మద్ సిరాజ్.. ఇక ఇప్పుడు ఇటీవలే ముగిసిన వన్డే సిరీస్ లో కూడా మంచి ప్రదర్శన చేశాడు అని చెప్పాలి. మెరుపు వేగంతో బంతులను విసురుతూ ప్రత్యర్థులను ముప్పు తిప్పులు పెట్టడంలో మంచి అనుభవం సాధించాడు మహ్మద్ సిరాజ్. ఇకపోతే ఇటీవలే ఒక అరుదైన మైలురాయిను చేరుకున్నాడు అని చెప్పాలి. అంతర్జాతీయ క్రికెట్లో 100 వికెట్ల మార్క్ అందుకున్నాడు మహమ్మద్ సిరాజ్. దీంతో అతని అభిమానులు అందరూ కూడా ఆనందంలో మునిగిపోయారు అని చెప్పాలి.
ఇటీవల ఆస్ట్రేలియా తో చెన్నైలోని చపాక్ స్టేడియం వేదికగా జరిగిన మూడో వన్డే మ్యాచ్లో రెండు వికెట్లు తీసి సత్తా చాటాడు మహమ్మద్ సిరాజ్. ఈ క్రమంలోనే ఈ ఘనత సాధించాడు అని చెప్పాడు. ఇక ఈ వంద వికెట్లలో 18 టెస్ట్ మ్యాచ్ లలో 47 వికెట్లు, 24 వన్డేలలో 43 వికెట్లు, 8 టీ20 లలో 11 వికెట్లు సాధించాడు మహమ్మద్ సిరాజ్. అయితే ఇలా తన ప్రదర్శనతో పర్వాలేదు అనిపించినప్పటికీ ఇతర జట్లు బౌలర్లు మంచి ప్రదర్శన చేసిన నేపథ్యంలో ఇక వన్డే ఫార్మాట్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని కోల్పోయాడు సిరాజ్. ఇకపోతే బౌలర్లు ఎంత బాగా రాణించినప్పటికీ బ్యాటింగ్ విభాగం మొత్తం విఫలం కావడంతో అటు చపాక్ వేదికగా జరిగిన 3 వన్డే మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయి సిరీస్ కోల్పోయింది.