సూర్య కుమార్ యాదవ్ టి20 ఫార్మాట్లో ఎంతటి విధ్వంసకర ఆటగాడు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మైదానం నలువైపులా కూడా అద్భుతమైన షాట్లు ఆడుతూ బౌలర్ల వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉంటాడు. బౌలర్ ఎంత అద్భుతమైన బంతి వేసిన కూడా తనదైన శైలిలోనే బౌండరీ బాదుతూ అభిమానులు అందరిని కూడా అలరిస్తూ ఉంటాడు అని చెప్పాలి. ఇక ఇలాంటి ఆట తీరుతోనే ప్రస్తుతం టి20 ఫార్మాట్లో వరల్డ్ నెంబర్వన్ బ్యాట్స్మెన్ గా కూడా కొనసాగుతూ ఉన్నాడు సూర్య కుమార్ యాదవ్. భారత క్రికెట్లో అతను ఫ్యూచర్ లెజెండ్ అంటూ ఎంతో మంది అభిమానించడం కూడా మొదలుపెట్టారు అని చెప్పాలి. కానీ అలాంటి సూర్య కుమార్ యాదవ్ కేవలం టి20 ఫార్మాట్ కి మాత్రమే సరిపోతాడా అంటే ప్రస్తుతం మాత్రం అతని ఫామ్ చూస్తే అవును అనే సమాధానమే ప్రతి ఒక్కరి నోటి నుంచి వస్తుంది. ఎందుకంటే మొన్నటికీ మొన్న టెస్ట్ ఫార్మాట్లో నిరాశపరిచిన సూర్య కుమార్ యాదవ్ ఇక ఇప్పుడు వన్డే ఫార్మాట్ లో అయితే తన ఆట తీరుతో అందరికి చిరాకు తెప్పిస్తున్నాడు . సిక్సర్లు, ఫోర్ లతో చెలరేగే సూర్య కుమార్ యాదవ్ డకౌట్ గా వెనతిరికాడు. అది కూడా ఒకటి కాదు రెండు కాదు వరుసగా మూడు మ్యాచ్ల్లో ఇదే రీతిలో వికెట్ కోల్పోయాడు.


 ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డే మ్యాచ్లలో కూడా మూడుసార్లు డక్ అవుట్ అయిన సూర్యకుమార్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. వన్డే ఫార్మాట్లో వరుసగా మూడు మ్యాచ్ లలో తొలి బంతికే డక్ అవుట్ అయిన తొలి ఆటగాడిగా నిలిచాడు. అంతేకాకుండా ఓ ఆటగాడు ఓకే సిరీస్ లో ఇలా డక్ అవుట్ కావడం ఇదే తొలిసారి. అయితే 1994లో సచిన్ టెండూల్కర్ కూడా ఇలాగే వరుసగా మూడు మ్యాచ్లలో డక్ అవుట్ కాక ఇక అతను ఆడిన రెండో బంతికి ఇలా వికెట్ కోల్పోయి వెను తిరిగాడు. కానీ సూర్య మాత్రం మొదటి బంతికే గోల్డెన్ డక్ గా వికెట్ కోల్పోయాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: