
కాగా ఇక రెండో మ్యాచ్ ని లక్నో సూపర్ జెయింట్స్ తో ఆడబోతుంది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. ఇక రెండో మ్యాచ్లో విజయం సాధించి బోనీ కొట్టాలని ఎంతగానో ఆశపడుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వాజ్పేయి స్టేడియం వేదికగా లక్నో జట్టుతో మ్యాచ్ ఆడబోతుంది. ఈ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ తప్పకుండా కం బ్యాక్ వస్తుంది అభిమానులు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే మొదటి మ్యాచ్ కి అందుబాటులో లేకుండా పోయిన కెప్టెన్ ఐడెం మార్కరమ్ రెండో మ్యాచ్ కి మాత్రం అందుబాటులోకి వచ్చేసాడు. నెదర్లాండ్స్ తో సిరీస్ ముగిసాక సన్రైజర్స్ జట్టులో చేరాడు ఐడెం మార్కరమ్.
అయితే అంతకు ముందు నెదర్లాండ్స్ తో జరిగిన వన్డే సిరీస్ లో అద్భుతమైన ఫాం కనబరిచి భారీగా పరుగుల వరద పారించాడు. దీంతో అతను వచ్చి జట్టులో చేరడంతో ఇక ఇప్పుడు సన్రైజర్స్ ఎంతో పటిష్టంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఐడెం మార్కరమ్ అందుబాటులోకి రావడంతో ఇక లక్నోతో మ్యాచ్లో హ్యారి బ్రూక్స్ ను పక్కన పెట్టనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో వికెట్ కీపర్ బ్యాటర్ అయిన గ్లెన్ ఫిలిప్స్ స్థానంలో హేన్డ్రిచ్ క్లాసెస్ ను తుది జట్టులోకి తీసుకుంటారు అని సమాచారం. అయితే 2023 మినీ వేళలో ఇంగ్లాండ్ పవర్ హిట్టర్ హ్యారి బ్రూక్స్ ను 13.25 కోట్లకు కొనుగోలు చేసింది సన్రైజర్స్. కానీ తొలి మ్యాచ్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. దీంతో అతని పక్కన పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.