ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా టెక్నాలజీని ఉపయోగిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరం కూడా మొబైల్ ఉపయోగిస్తూ ఉంటాము. అయితే మొబైల్ ఛార్జింగ్ చేసేటప్పుడు కొన్ని తప్పులు చేస్తూ ఉంటాము. అలా చేసేటప్పుడు మొబైల్ పేలే ప్రమాదం ఉంటుందట. మొబైల్ ఛార్జింగ్ కు సంబంధించి పలు ప్రశ్నలు ప్రతి ఒక్కరికి సందిగ్ధంగానే ఉంటాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.


ఎక్కువమంది రాత్రిపూట మొబైల్ లో ఛార్జింగ్ ఉంచడం అలవాటుగా మారిపోయి ఉంటుంది. అలా చేయడం ద్వారా మరుసటి రోజు మొత్తం ఆ ఛార్జింగ్ ఉపయోగపడుతుందని అనుకుంటూ ఉంటారు.. అసలు మొబైల్ బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ కావడానికి 6 నుండి 8 గంటల సమయం అవసరం లేదు అంతసేపు మొబైల్ ఛార్జింగ్ పెడితే ఏమవుతుంది అనే విషయాన్ని పలువురు పరిశోధకులు,  టెక్నీషియా కనుక్కోవడం జరిగింది. స్మార్ట్ మొబైల్ ఫుల్లుగా 100% చార్జింగ్ అయిన తరువాత మీ మొబైల్ ఛార్జింగ్ ఆగిపోతుంది. అయితే పాత ఫోన్లలో అయితే చార్జింగ్ విషయంలో పలు సమస్యలు తలెత్తుతూ ఉంటాయి.


స్మార్ట్ మొబైల్స్ ఛార్జింగ్ సర్క్యూట్ ఉంటుంది..100% చార్జింగ్ అయిపోయిన తర్వాత సరఫరా నిలిపివేయడం జరుగుతుంది చాలా స్మార్ట్ ఫోన్లలో ఇప్పుడు స్నాప్ డ్రాగన్ ప్రాసెస్ ఉంటుంది.ఇది బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయిన వెంటనే మొబైల్ ఛార్జింగ్ను ఆపి వేస్తుంది. ఇంకా చెప్పాలి అంటే ఏ ప్రాసెస్ బ్యాటరీ 90% వచ్చిన వెంటనే మళ్ళీ చాట్ చేయడం ప్రారంభించేంత స్మార్ట్ గా ఉంటుందని చెప్పవచ్చు. చాటింగ్ చేసేటప్పుడు మొబైల్ వేడిగా ఉన్నప్పుడు చాలామంది భయపడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఛార్జింగ్ సమయంలో లిథియం అయాన్ బ్యాటరీ రసాయన ప్రతిచర్యకు గురవుతూ ఉంటుందట. అందుచేతనే బ్యాటరీ అప్పు డప్పుడు వేడెక్కుతుందని నిపుణులు తెలుపుతున్నారు. అందుకోసమే రాత్రిపూట మొబైల్ ఛార్జింగ్ చేయడం మంచిది కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: