ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం సరికొత్త ఫీచర్లను తీసుకువస్తూనే ఉంటుంది వాట్సప్ సంస్థ.. అందుకే ఈ సోషల్ మీడియాకు ఇంతటి క్రేజీ ఏర్పడిందని చెప్పవచ్చు. ఇప్పటికే మెసేజ్ ఎడిట్ చాట్, లాక్ వంటి అనేక ఫీచర్స్ తో వాట్సాప్ బాగానే ఆకట్టుకుంటుంది ఇప్పుడు తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ తో కస్టమర్లను ఆకట్టుకునే విధంగా చేయాలని చూస్తోంది వాట్సప్ సంస్థ. వీడియో కాలింగ్ స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ను వాట్సప్ తాజాగా తీసుకు రాబోతున్నట్లు తెలియజేస్తోంది.


సాధారణంగా జూమ్ గూగుల్ మీటింగ్ యాపులు ఈ స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ మాత్రమే ఉన్నది. ఆఫీస్ మీటింగ్ లేకపోతే మరీ ఇతర సమావేశాలలో అయినా సరే ఒక యూజర్ ఈ ఆప్షన్ ద్వారా తమ స్క్రీన్ గ్రూపులో ఉన్న వారందరికీ సైతం షేర్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఫీచర్ ని వాట్సాప్ సైతం తమ కస్టమర్లకు సైతం తీసుకువచ్చేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఫీచర్ కొన్ని బీటా టెస్టర్ కు వాట్సప్ అందుబాటులో పంపించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా టెస్టింగ్ దశలో ఉన్నందని తెలుస్తోంది.


ఈ ఫీచర్ వల్ల ఎవరితోనైనా వీడియో కాల్ మాట్లాడుతున్న సమయంలో మన మొబైల్ స్క్రీన్ అవతల వ్యక్తికి షేర్ చేసే అవకాశం లభిస్తుందట. ఇందుకోసం స్క్రీన్ అడుగుభాగంలో కొత్తగా స్క్రీన్ షేరింగ్ అనే బటన్ ని కూడా వాట్సాప్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది ఈ బటన్ ని క్లిక్ చేస్తే మీ మొబైల్ చేసి ప్రతిదీ రికార్డు అవ్వడంతో పాటు అవతల వ్యక్తికి కూడా షేర్ అవుతుందట . దీనిని యూజర్స్ అనుమతి తప్పనిసరి. గ్రూప్ వీడియో కాలింగ్ ఎక్కువమంది యూజర్స్ ఉంటే స్క్రీన్ షేర్ ఆప్షన్ పనిచేయకపోవచ్చు అని సమాచారం. ఓల్డ్ మొబైల్ ఆండ్రాయిడ్ వర్షన్ లో ఈ ఆప్షన్ ఉండకపోవచ్చని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: