
అయితే హైపర్ ఆది ఎక్కువగా షో లు చేయడం వల్ల సమయం సరిపోక జబర్దస్త్ దూరం ఉన్నారని వార్తలు కూడా వినిపించాయి. ఆ మధ్య మళ్లీ రీఎంట్రీ ఇస్తానని హైపర్ ఆది తెలియజేయడం జరిగింది అయితే ఇప్పుడు తాజాగా జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇవ్వడం కూడా జరిగింది అందుకు సంబంధించిన ఒక ప్రోమో కూడా ఇప్పుడు కాస్త వైరల్ గా మారుతోంది. అయితే ఈసారి ఇందులో కాస్త ఓవరాక్షన్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇక హైపర్ ఆది వస్తుంటే ఏదో పెద్ద విఐపి వచ్చినట్లుగా చాలా బిల్డప్ ఇచ్చారని పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు నేటిజన్స్.
ఈ ప్రోమో లో చూపించిన విధంగా.. హైపర్ ఆది వస్తుంది పోలీసులు ఇలా సపరేట్ సాంగు వేసి ఎంట్రీ చాలా పెద్ద లెవెల్ లో ప్లాన్ చేసినట్టుగా కనిపిస్తోంది. మొత్తానికి హైపర్ ఆది రాక తో జబర్దస్త్ తిరిగి ఊపిరి పీల్చుకున్నట్లుగా కనిపిస్తోంది. అయితే ఇదివరకట్ల హైపర్ ఆది దొరబాబు, పరదేశి మీద కౌంటర్లు ఉంటాయో లేదో అన్నట్లుగా అభిమానులు తెలియజేస్తున్నారు. అయితే ప్రస్తుతం అనసూయ సోలు లేదు కాబట్టి రష్మి మీద కౌంటర్లు వేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రోమో కాస్త వైరల్ గా మారుతోంది.