బుల్లితెర సీరియల్స్ ద్వారా మంచి ప్రేక్షకాదరణ పొందిన వారిలో నటి రోహిణి కూడ ఒకరు. ఇమే ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ముఖ్యంగా ఈమె జబర్దస్త్ ద్వారా మరింత పాపులర్ అయ్యి పలు కార్యక్రమాలలో సినిమాలలో కూడా బిజీగా మారిపోయింది. జబర్దస్త్ లోని మొదటి లేడీ టీమ్ లీడర్ గా కూడా గుర్తింపు పొందింది రోహిణి. అయితే పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో తిరిగి ఇతర టీమ్ లో కమెడియన్ గా చేస్తూ ఉంది. ముఖ్యంగా జబర్దస్త్ టీం లీడర్స్ ఇతర చానల్స్ లో పెద్దగా కనిపించారని చెప్పవచ్చు. అయితే రోహిణికి మాత్రం అలాంటి వెలుసుబాట కల్పించారు మల్లెమాలవారు.


ఈ ముద్దుగుమ్మ ఇతర చానల్స్ లో కూడా పలు షోలలో కనిపిస్తూ ఉంటుంది. ఇక తాజాగా జీ తెలుగులో ప్రసారమైన ఒక డ్యాన్స్ కార్యక్రమంలో సందడి చేయడం జరిగింది. ఇక స్టార్ మా లో కూడా అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటుంది రోహిణి. ఇక అక్కడ ఇక్కడ అన్నిచోట్ల కూడా కనిపిస్తూ ఉన్న రోహిణి మల్లెమాలవారు జబర్దస్త్ లో ఎంతటి పారితోషకం ఇస్తారు అన్న విషయం ఇప్పుడు అభిమానులలో సందేహంగా మారింది. జబర్దస్త్ లో ఉండే కమెడియన్లకు రెమ్యూనరేషన్ కంటే పాపులారిటీని ముఖ్యమని చెప్పవచ్చు.


అయితే నెలకు రోహిణి రూ.2 లక్షల రూపాయలు అందుకుంటోందని సమాచారం. ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోకుండా తనతో పాటు ఉండే కంటెస్టెంట్లకు కూడా పంచుతూ ఉంటుందట రోహిణి. ఇక ఈమెకు ఎక్కువగా ఇతర చానల్స్ ద్వారా కూడా వస్తూ ఉండడంతో జబర్దస్త్ లో తనతో పాటు చేస్తున్న ఇతర కంటిస్టెంట్లకు జబర్దస్త్ ద్వారా వచ్చే రెమ్యూనరేషన్ కాస్త ఎక్కువగానే కంటెస్టెంట్లకు ఇస్తున్నట్లుగా ఆమె సన్నిహితులు తెలియజేసినట్లుగా సమాచారం. రోహిణి అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించడమే కాకుండా అటు బుల్లితెర ఇటు వెండితెరవైపు రెండు చేతుల సంపాదిస్తూ ఉన్నది. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: