
వర్సటైల్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆలీతోపాటు పోసాని కృష్ణ మురళి హాజరయ్యి సందడి చేశారు. వారి ఎంట్రీ తో సుమా మాటలతో బాగా నవ్వించింది. ఆ తర్వాత ఫోన్ ఉండడం మంచిదా? లేకపోవడం మంచిదా? అంటూ ప్రశ్నలతో.. సమాధానాలు కూడా అంతే సరదాగా తెలిపారు. ఎటువంటి సోషల్ మీడియా ఖాతాలు మీ ఫోన్లో లేవా అని అడిగితే.. ఎందుకు అవన్నీ అంటూ పోసాని కౌంటర్ వేయడం అందరిని నవ్వించారు. అక్కడున్న స్టూడెంట్స్ ని కూడా ఇదే ప్రశ్న అడగడంతో వారి సమాధానాలకు మెచ్చి అలీ కూడా వారికి చాక్లెట్స్ అందివ్వడం జరిగింది.
మధ్యలో పోసాని దగ్గరకు ఇద్దరు జబర్దస్త్ కామెడీయన్స్ భార్యాభర్తలుగా వచ్చి సందడి చేశారు. అందులో లేడీ కమెడియన్ తనకు పిల్లలు కావాలని అడగడంతో వెంటనే పోసాని తన ఇంటి పక్క అడ్రస్ ఇచ్చి అక్కడ ఉండమని చెబుతూ అందరికీ నవ్వులు పూయించాడు. అంతేకాదు స్టూడెంట్స్ అడిగిన ప్రశ్నలకు కూడా పోసాని తన స్టైల్ లో సమాధానం ఇస్తూ అందరిని ఆకర్షించారు. మధ్యలో విద్యులేఖ కూడా వచ్చి అలరించింది మొత్తానికైతే సుమ అడ్డాకు సంబంధించిన ప్రోమో బాగా వైరల్ గా మారుతుండగా ఈ ఎపిసోడ్ ఫిబ్రవరి 4వ తేదీన ఈటీవీలో ప్రసారం చేయనున్నారు.