
ఈమెతోపాటు ఈమె కూతురు సుప్రీత కూడా సినిమాలలోకి రాకపోయినా సోషల్ మీడియా ద్వారానే హీరోయిన్ రేంజ్ లో అభిమానులను సొంతం చేసుకుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది సుప్రీత. అంతేకాదు అప్పుడప్పుడు వీరిద్దరూ మితిమీరిన గ్లామర్ షో చేస్తూ నిటిజన్లు చేతిలో ట్రోలింగ్ కూడా గురవుతూ ఉంటారు. అయితే ఇలా నెటిజెన్స్ కామెంట్ చేసినప్పటికీ కూడా వారి ధోరణిలో వారు సోషల్ మీడియాలో సందడి చేస్తారే తప్ప ఇలాంటి నెగటివ్ కామెంట్స్ ని వారు ఎప్పుడు పట్టించుకోరు..
ఇదిలా ఉండగా తాజాగా రవితేజ నటించిన ధమాకా సినిమాలోని పల్సర్ బైకు పాటకు సుప్రీత మాత్రం డాన్స్ వేశారు. అయితే ఈ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇందులో సుప్రీత పొట్ట చాలా క్లియర్ గా కనిపిస్తున్నట్లు మనం చూడవచ్చు. నెటిజన్స్ కామెంట్ చేయకముందే సుప్రీత ఈ వీడియోని షేర్ చేస్తూ ఇన్నర్ వేసుకోవడం మర్చిపోయా అంటూ బోల్డ్ గా కామెంట్లు చేయడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. సాధారణంగా సినిమా సెలబ్రిటీలు వారి ఆహారపు అలవాట్ల కారణంగా కొందరిలో పొట్ట అధికంగా కనపడుతూ ఉంటుంది . కానీ పొట్ట కనపడకుండా ఉండడం కోసం సెలబ్రిటీలు టమ్మి టక్కర్ అనే ఇన్నర్ వేర్ ధరిస్తూ ఉంటారు ఇది ధరించడం వల్ల వారికి పొట్ట ఉన్నా సరే ఉన్నట్టు కనిపించదు. అలాగే వారి బాడీ కూడా చాలా ఫీట్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ డాన్స్ వీడియో చేసే సమయంలో ఆమె టమ్మీ టక్కర్ వేసుకోవడం మర్చిపోయారని స్పష్టమవుతుంది.