ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీ లలో సందడి చేయడానికి బ్లాక్ బాస్టర్ మూవీస్ వచ్చేసాయి. ఉగాది పండుగ పురస్కరించుకొని మూడు సూపర్ హిట్ చిత్రాలు ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అవ్వడం జరిగింది. మరి ఆ చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

పఠాన్:
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా సరైన హిట్టు లేక సతమతమవుతున్న షారుక్ ఖాన్ కు ఇది మంచి విజయాన్ని అందించింది.  అంతేకాదు కలెక్షన్ల రికార్డు కూడా బ్రేక్ చేసింది. సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో దీపికా పదుకొనే హీరోయిన్గా నటించిన ఈ చిత్రం జనవరి 25వ తేదీన విడుదలై ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్లకు పైగా వసూలను రాబట్టి రికార్డు సృష్టించింది. ఒక హిందీలోనే కాదు పాన్ ఇండియా రేంజ్ లో సినిమా విడుదలవడం సినిమాకు ప్లస్ అయిందని చెప్పాలి ఇక ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా  ఈ సినిమా మార్చి 22 నుంచి తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో స్క్రీమింగ్ అవుతోంది.

వినరో భాగ్యము విష్ణు కథ:
కిరణ్ అబ్బవరం కాశ్మీరా పరదేశి నటీనటులుగా జియో టు పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ చిత్రం వినరో భాగ్యం విష్ణు కథ. మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 18న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మంచి డీసెంట్ హిట్టుతో దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఆహా మరియు నెట్ఫ్లిక్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

పంచతంత్రం:
బ్రహ్మానందం, స్వాతి రెడ్డి , సముద్రఖని,  శివాత్మిక రాజశేఖర్, దివ్య శ్రీపాద,  రాహుల్ విజయ్ తదితరులు నటించిన చిత్రం పంచతంత్రం.. ది వీకెండ్ మీడియా సమర్పణలో టికెట్ ఫ్యాక్టరీ ఎస్ ఒరిజినల్స్ బ్యానర్ పై హర్ష పులిపాక దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 9న విడుదలయ్యింది. ఇక ఈ మూవీ ఇప్పుడు మార్చి 22 నుంచి ఈటీవీ విన్ యాప్ లో చూడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: